Silver Price Today: దిగివస్తున్న వెండి ధరలో.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ ఎంత ఉందంటే..
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది. గత కొద్ది రోజులుగా సిల్వర్ రేట్స్ తగ్గతూ వస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు పెరుగుదలను
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది. గత కొద్ది రోజులుగా సిల్వర్ రేట్స్ తగ్గతూ వస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు పెరుగుదలను నమోదు చేసుకుంటున్నాయి. ఇక దేశీయ మార్కెట్లో మాత్రం సిల్వర్ రేట్స్ నెలచూపు చూస్తున్నాయి. తాజాగా శుక్రవారం మరోసారి వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధర రూ.310 తగ్గి రూ.70,200 దగ్గర కొనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన మార్కెట్లలో 100 గ్రాముల సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ. 750 ఉండగా.. కిలో సిల్వర్ రేట్ రూ.75,000 దగ్గర ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా 10 గ్రాముల వెండి రూ.750 ఉండగా.. కిలో సిల్వర్ రేట్ రూ.75,000 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ.702 ఉండగా.. కిలో ధర రూ.70,200 ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.702 ఉండగా.. కిలో వెండి ధర రూ.70,200 ఉంది. చెన్నైలో 10 గ్రాముల ధర రూ.750 ఉండగా.. కిలో వెండి ధర రూ.75,500 దగ్గర కొనసాగుతుంది.
Also Read:
Gold Price Today: తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..దేశీయ మార్కెట్లో ఇవాళ పసిడి ధర ఎంత తగ్గిందంటే..