Silver Price Today: వెండి ధరలకు బ్రేక్.. మళ్లీ తగ్గిన రేట్లు… ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే?

|

May 21, 2021 | 5:57 AM

Silver rate Today: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు

Silver Price Today: వెండి ధరలకు బ్రేక్.. మళ్లీ తగ్గిన రేట్లు... ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే?
Silver Price
Follow us on

Silver rate Today: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతాయన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా తాజాగా.. శుక్రవారం కూడా వెండి ధరలు తగ్గాయి. కిలో వెండికి 700 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 72,300 రూపాయలు ఉంది. కాగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,300 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 72,300 గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.76,900 ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.72,300 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,300 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో వెండి కిలో రూ.76,900 లు ఉంది.
విజయవాడలో వెండి రూ.76,900లు వద్ద కొనసాగుతోంది.
కాగా.. దక్షిణాది నగరాల్లోనే ధరలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,750 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,750 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,750 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Extra Income in Lockdown: మీకు అదనపు ఆదాయం కావాలా..! ఇలా చేయండి..! ఇక డబ్బే.. డబ్బు..!

Waiter Murder for Chicken: చికెన్‌ ముక్కలు లేవన్నందుకు వెయిటర్‌ హత్య.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు