Silver rate Today: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతుంటాయి. నిత్యం బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం చోటుచేసుకుంటూనే ఉంటుంది. ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. కాగా బుధవారం 2వేల మేర పెరిగిన కిలో వెండి ధర.. గురువారం వేయి రూపాయల మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర 72,000 నుంచి 71,000లకు తగ్గింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,000 లు ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.73,000 గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500 ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.73,000 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో వెండి కిలో రూ.77,500 లు ఉంది.
విజయవాడలో వెండి రూ.77,500లు వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలిలా..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,450 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,590 వద్ద కొనసాగుతోంది.
Also Read: