Silver rate Today: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ బంగారం, వెండి ధరల్లో మాత్రం మార్పు పెద్దగా కనిపించడం లేదు. అయితే.. బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా తాజాగా.. మంగళవారం వెండి ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండికి 600 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 71,000 రూపాయలు ఉంది. కాగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,000 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 71,000 గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.75,800 గా ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో రూ.71,000 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,000 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో వెండి కిలో రూ.75,800 లు ఉంది.
విజయవాడలో వెండి రూ.75,800 లు కొనసాగుతోంది.
కాగా.. దక్షిణాది నగరాల్లోనే ధరలు ఎక్కువగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.49,970 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,970 వద్ద కొనసాగుతోంది.
Also Read: