AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: సెంచరీ కొట్టిన సిల్వర్‌..! ఆసక్తికర పోస్ట్‌ పెట్టిన రాబర్ట్‌ కియోసాకి

ప్రస్తుతం వెండి ధరలు అంతర్జాతీయంగా ఔన్స్‌కు 100 డాలర్ల మార్కును దాటి రికార్డు సృష్టించాయి. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి గతంలో ఇచ్చిన పెట్టుబడి సలహా నిజం కావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

Silver: సెంచరీ కొట్టిన సిల్వర్‌..! ఆసక్తికర పోస్ట్‌ పెట్టిన రాబర్ట్‌ కియోసాకి
Silver Price Soars Kiyosaki
SN Pasha
|

Updated on: Jan 24, 2026 | 8:06 PM

Share

గత కొంతకాలంగా వెండి ధరలు దూకుడు చూపిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ అనిశ్చితులు, పెరిగిన డిమాండ్‌తో సిల్వర్ ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. 2025 ఆరంభంలో నామమాత్రంగా ఉన్న వెండి ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా వెండి ధర అంతర్జాతీయంగా ఔన్స్‌కు 100 డాలర్ల మార్క్‌ను దాటేసింది. ఈ పెరుగుదలపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి స్పందించారు. ఏడాది క్రితం వెండి కొనుగోలు చేయమని పెట్టుబడిదారులకు సలహా ఇచ్చిన ఆయన ఇప్పుడు ఆయన అంచనా నిజం అవ్వడంతో ఆ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

‘వెండి 100 డాలర్లు (ఔన్స్‌కు) దాటుతోంది..’ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి హార్డ్ అసెట్లకు కియోసాకి ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. సాధారణ ప్రజలను కూడా ఆయన వెండి అప్పుడే కొనమని కోరారు కూడా. ధనవంతులు అవ్వాలంటే.. వెండిపై పెట్టుబడి పెట్టాలని అన్నారు.

వెండి ధర పెరుగుదలకు కారణాలు

వెండిని ఆభరణాలు, వస్తువుల రూపంలో ఉపయోగించడమే కాకుండా, పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే లోహం కావడం వల్ల వెండికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో వినియోగం వెండి భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. అయితే విశ్లేషకులు వెండి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయని, ఇది అత్యంత అస్థిరమైన లోహాల్లో ఒకటని హెచ్చరిస్తున్నారు. అయితే ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని కియోసాకి తెలిపారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి