Gold, Silver Prices : బంగారం, వెండి ధరలు దేశీయ మార్కెట్లో మిశ్రమంగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఉదయం సెషన్లో అతి స్వల్పంగా రూ.16 తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.9000 వరకు తక్కువగా ఉంది. చాలా రోజులకు ఆల్ టైమ్ గరిష్టంతో ఈ స్థాయిలో తగ్గింది. కాగా, నిన్న ఫ్యూచర్ మార్కెట్లో ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.468 తగ్గి రూ.47,545 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.485 క్షీణించి రూ.47,650 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.226 క్షీణించి రూ.68,700, మే ఫ్యూచర్స్ సిల్వర్ రూ.206 తగ్గి రూ.69,785 వద్ద ముగిసింది.
బంగారం ధరలు గత ఏడాది ఆగస్టులో రికార్డు స్థాయిలో నమోదయ్యియి. 10 గ్రాములకు రూ. 56,200 వరకు పెరిగింది. ప్రపంచంలోని చాలా దేశాలలో కరోనా టీకా డ్రైవ్ జరుగుతున్నా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. ప్రజల దగ్గర ఆదాయం లేకున్నా బంగారానికి డిమాండ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. డాలర్‌లో మార్పుల వల్ల బంగారంలో హెచ్చుతగ్గులు నెలకొంటున్నాయి. బంగారంపై కస్టమ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమయంలో ప్రతిపాదించింనా బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. రాబోయే ఆరు నెలల్లో రూ. 56500 కంటే ఎక్కువగా ధరలు నమోదయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.