ప్రసిద్ధ ఫెయిర్‌నెస్ క్రీమ్ కంపెనీ అయిన ఇమామి తన చర్మ రంగును మెరుగుపర్చడంలో విఫలమైందని పేర్కొంటూ ఒక వినియోగదారు ఢిల్లీ కన్స్యూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించాడు. ఆ ఫిర్యాదును విచారించిన కమిషన్ మోసపూరిత ప్రకటనలకు సంబంధించిన ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్ తయారీదారు ఇమామీ లిమిటెడ్‌పై రూ. 15 లక్షల జరిమానా విధించింది. 2013లో ఓ వినియోగదారుడు రూ. 79తో ఇమామి ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను కొనుగోలు చేశాడు. ఈ క్రీమ్‌ను రెగ్యులర్‌గా వాడితే చర్మం కాంతివంతం అవుతుందనే ప్రకటనకు ఆకర్షిస్తుడై ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను కొనుగోలు చేశాడు. ముఖ్యంగా ఆ వ్యక్తి ప్యాకెట్‌పై నిబంధనలకు అనుగుణంగా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను వాడినా ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో అతడు ఆ ప్రకటన తప్పుదారి పట్టించేలా ఉందని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
అప్పటి నుంచి సుదీర్ఘ విచారణల తర్వాత డిసెంబర్ 9న సెంట్రల్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్యాకేజింగ్‌లోని సూచనల ప్రకారం క్రీమ్‌ను ఉపయోగించినప్పటికీ అతని చర్మం మారలేదని, అతనికి ప్రచారం చేసిన ప్రయోజనాలేవీ కనిపించడం లేదని వినియోగదారు వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే వినియోగదారు సూచనలను సరిగ్గా పాటించలేదని, అతను సిఫార్సు చేసిన నియమావళికి కట్టుబడి ఉన్నాడని నిరూపించడంలో విఫలమయ్యాడని కంపెనీ పేర్కొంది. ఆశించిన ఫలితాలను సాధించడానికి సమతుల్య ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన అలవాట్లు వంటి అంశాలు చాలా అవసరమని ఇమామి వాదించింది. అయితే ఈ పరిస్థితులు ఉత్పత్తి లేబుల్‌పై పేర్కొనబడలేదు.
ఇమామి క్లెయిమ్‌లు అసంపూర్తిగా, అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంటూ కోర్టు ఇమామి వాదనలను తిరస్కరించింది. అలాగే ఢిల్లీ వినియోగదారుల ఫోరమ్ ఇమామీ లిమిటెడ్‌ను కస్టమర్‌కు రూ. 15 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ముఖ్యంగా కంపెనీ ప్రకటనల పద్ధతులు వినియోగదారులను తప్పుదారి పట్టించాయని, అలాగే న్యాయమైన వాణిజ్య ప్రమాణాలను ఉల్లంఘించాయని పేర్కొంది. ఈ జరిమానా మొత్తం ఫిర్యాదుదారుకు చెల్లించాలని స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి