Central Government: రెస్టారెంట్‌కు వెళుతున్నారా..? బిల్లులో సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాల్సిందేనా..? కేంద్రం కీలక ప్రకటన

మీరు ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లారనుకుందాం. బిల్లు చెల్లించే సమయంల సర్వీస్ ఛార్జి అనే పదం వినే ఉంటారు. ఇది ఖచ్చితంగా చెల్లించాలా లేదా అనే దానిపై కస్టమర్లకు చాాలా అనుమానాలు ఉంటాయి. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే..

Central Government: రెస్టారెంట్‌కు వెళుతున్నారా..? బిల్లులో సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాల్సిందేనా..? కేంద్రం కీలక ప్రకటన
Service Charge

Updated on: Mar 02, 2026 | 12:38 PM

ఫ్రెండ్స్‌తో పార్టీలనో లేదా ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేందుకు రెస్టారెంట్లు, హోటళ్లకు వెళుతూ ఉంటాం. లేకపోతే మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఒంటరిగా అయినా దగ్గర్లోని హోటల్ లేదా మాల్స్, రెస్టారెంట్లకు వెళ్తుంటాం. అయితే అంతా తిన్నాక వెయిటర్ బిల్లు తెచ్చి అందిస్తాడు. ఆ బిల్లులో సర్వీస్ ఛార్జీలు అని ఉండటం మనం చూసే ఉంటాం. జీఎస్టీ, వ్యాట్, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్‌తో పాటు సర్వీస్ ఛార్జ్ అంటూ అదనంగా వసూలు చేస్తారు. చాలామందికి తెలియక సర్వీస్ ఛార్జి చెల్లిస్తూ ఉంటారు. మరికొంతమంది సర్వీస్ ఛార్జి ఎందుకని సిబ్బందిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సిందేనా? అనే అనుమానం అందరికీ ఉంటుంది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ఫిర్యాదు చేయండి

అయితే ఖచ్చితంగా సర్వీస్ ఛార్జి కస్టమర్లు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్స్ యజమానులు బలవంతంగా వీటిని తమ కస్టమర్ల నుంచి వసూలు చేసే అధికారం లేదని, అది కష్టమర్ల ఇష్టమని స్పష్టం చేసింది. కస్టమర్‌కు సంతృప్తి అనిపిస్తేనే ఇష్టానుసారం సర్వీస్ ఛార్జి చెల్లించవచ్చని, వారి అనుమతి తీసుకున్న తర్వాతే బిల్లులో చేర్చాలని సూచించింది. ఒకవేళ కస్టమర్ అనుమతి లేకుండా బిల్లులో పొందుపరిస్తే తిరిగి పొందే అధికారం ఉంటుందని తెలిపింది. ఎవరైనా యజమానులు ఖచ్చితంగా చెల్లించాల్సిందేనని బలవంతం పెడితే ఫిర్యాదు చేసేందుకు కేంద్రం హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. అలాగే వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తోంది. వీటి ద్వారా కస్టమర్లు రెస్టారెంట్, హోటల్స్ యాజమాన్యాలపై ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు సకాలంలో స్పందించి వారిపై చర్యలు తీసుకుంటారు.

ఎలా ఫిర్యాదు చేయాలంటే..?

హెల్ప్ లైన్ నెంబర్ 1915కి కాల్ చేసి వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. ఇక 8800001915 అనే నెంబర్‌కు వాట్సప్ ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఈ విషయాలను కన్జూమర్ అపైర్స్ మినిస్ట్రీ తన ఎక్స్‌లో పొందుపర్చింది. కస్టమర్లు ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఇటీవల ముంబై, పాట్నాలో రెండు రెస్టారెండ్లు బిల్లులో 10 శాతం వరకు సర్వీస్ ఛార్జీ వసూలు చేశారు. దీంతో కస్టమర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు.. తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతో యాజమాన్యాలకు పెనాల్టీ కూడా చెల్లించాయి. కస్టమర్ల అనుమతి లేకుండా బిల్లుల సర్వీస్ ఛార్జీ వసూలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో సర్వీస్ ఛార్జీలపై కేంద్రం స్పష్టతిచ్చింది.

Follow Us