Stock Market: ఫలితాల దెబ్బ.. స్టాక్ మార్కెట్ల అబ్బ.! ఒక్క రోజులోనే ఏకంగా లక్షల కోట్ల ఆవిరి..
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎవరికీ కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోగా.. రెండు కూటములు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఫేవర్‌గా వెలువడటంతో..

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎవరికీ కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోగా.. రెండు కూటములు పోటాపోటీగా కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఫేవర్‌గా వెలువడటంతో.. సోమవారం సరికొత్త రికార్డు స్థాయిలో భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఒక్కసారిగా కుదేలయ్యాయి. సెన్సెక్స్ 2696 పాయింట్లు నష్టపోయి 73,786 వద్ద ట్రేడ్‌వుతోంది. నిఫ్టీ 831 పాయింట్లు నష్టపోయి 22,432 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.
లోక్‌సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 272 కాగా.. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం లేకపోవడం.. అలాగే ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి మధ్య సీట్ల విషయంలో పెద్దగా తేడా లేకపోవడంతో.. మడుపరులకు ఇది పెద్దగా రుచించట్లేదు. దీంతో స్టాక్ మార్కెట్లపై పెద్ద దెబ్బ పడింది. ఇక ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీకి 239 సీట్లు వచ్చాయి.
ఇది చదవండి: వారణాసిలో ప్రధాని మోదీ ముందంజ.. ఇండియా కూటమి ఎన్ని స్థానాల్లో
టాటా స్టీల్, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, రియలన్స్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా,అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే.
ఇది చదవండి: ఏపీలో కొనసాగుతోన్న కూటమి అభ్యర్థుల ఆధిక్యం..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




