సోమవారం స్టాక్ మార్కెట్లు(StocK market) నష్టాల్లో ముగిశాయి. ఉదయం సెషన్ ప్రారంభం కాగానే సెన్సెక్స్(Sensex) 917 పాయింట్ల వరకు తగ్గిపోయి.. 54 వేల దిగువకు చేరుకుంది. అయితే ఐటీ, ఆటో సూచీలు మెరుగుపడటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 365 పాయింట్ల తగ్గf 54,470 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nifty) 109 పాయింట్ల పతనంతో 16301 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ టాప్-30లోని 14 షేర్లు లాభాలతో ముగియగా, 16 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 1.78 శాతం, స్మాల్ క్యాప్ 2.12 శాతం క్షీణించాయి.
నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 1.47, నిఫ్టీ మెటల్ 2.03, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్1.55 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీ ఐటీ మాత్రం స్వల్ప లాభాల్లో ముగిసింది. పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్, నెస్లే ఇండియా షేర్లలో అతిపెద్ద పతనం నమోదైంది. రిలయన్స్ స్టాక్ స్టాక్ 4.30 శాతం పడిపోయి రూ. 2,508కి చేరుకుంది. ఇదిలా ఉండగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC’s) IPO బిడ్డింగ్ చివరి రోజున 2.88 రెట్లు ఓవర్‌సబ్‌స్ర్కైబ్ అయింది.
Read Also.. Digital Banking Units: 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు.. ప్రజలకు మరింత చేరువకానున్న సేవలు..