Stock Market: భారీగా పతనమైన దేశీయ మార్కెట్ సూచీలు.. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ మార్కెట్‌లో వారంలో నాలుగో ట్రేడింగ్ రోజైన గురువారం సెన్సెక్స్, నిఫ్టీలు పతనంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,138 పాయింట్ల నష్టంతో 53,070 వద్ద, ని..
Stock Market: దేశీయ మార్కెట్‌లో వారంలో నాలుగో ట్రేడింగ్ రోజైన గురువారం సెన్సెక్స్, నిఫ్టీలు పతనంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,138 పాయింట్ల నష్టంతో 53,070 వద్ద, నిఫ్టీ 323 పాయింట్లు జారి 15,917 వద్ద ప్రారంభమయ్యాయి. నేడు మెటల్, ఐటీ షేర్లలో అత్యధిక పతనం అయ్యాయి. సెన్సెక్స్ నష్టపోయిన వాటిలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, విప్రో ఉన్నాయి. అదే సమయంలో, ITC నేడు 3 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. BSEలో దీని షేర్లు రూ. 8.9 లేదా 3.3% పెరిగి 274.4కి చేరాయి.
మరోపక్క అమెరికా మార్కెట్లు కూడా భారీగా నష్టపోవడం దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇందుకు తోడు మార్కెట్ తీరును అంచనా వేసే విక్స్ సూచీ 9శాతం పెరగడం ఇన్వెస్టర్లను అమ్మకాలకు ప్రోత్సహించింది. ఐరోపా ఖండంలోని ఫైనాన్షియల్ హబ్ అయిన యూకేలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల అత్యధికానికి పెరిగింది. ముఖంగా ఇంధన రంగంలో పెరుగుదల దీనికి కారణమైంది. చివరి సారిగా 1982లో ఈ స్థాయిలో యూకేలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ పరిణామాలు మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి