Bank Account: మీకు బ్యాంకు అకౌంట్‌ ఉందా..? రూ.4 లక్షల వరకు బెనిఫిట్స్‌.. పూర్తి వివరాలు..!

|

Oct 04, 2021 | 9:47 AM

Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ రకాల బ్యాంకులు ఇన్సూరెన్స్‌ పాలసీలు కూడా అందిస్తున్నాయి. అలాగే కొన్ని..

Bank Account: మీకు బ్యాంకు అకౌంట్‌ ఉందా..? రూ.4 లక్షల వరకు బెనిఫిట్స్‌.. పూర్తి వివరాలు..!
Follow us on

Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ రకాల బ్యాంకులు ఇన్సూరెన్స్‌ పాలసీలు కూడా అందిస్తున్నాయి. అలాగే కొన్ని బ్యాంకుల్లో పెట్టుబడులు పెడితే ఎన్నో రకాల బెనిఫిట్స్‌ పొందవచ్చు. అయితే మీకు బ్యాంకు అకౌంట్‌ ఉంటే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అతితక్కువ మొత్తంతోనే అదిరే బెనిఫిట్ పొందవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక విషయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకాలు బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చేరడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

ఈ రెండు స్కీమ్స్‌లో చేరడం వల్ల ఏడాదికి రూ.342 కట్టాలి. అంటే నెలకు రూ.28 వరకు ఆదా చేస్తే సరిపోతుంది. అంటే రోజుకు రూ.1 పొదుపు చేస్తే చేయాలన్న మాట. బ్యాంక్ ఖాతా ఉన్న వారు ఈ పథకంలో చేరవచ్చు. డబ్బులు ఆటోమేటిక్‌గానే అకౌంట్ నుంచి కట్ అవుతాయి.

ఇక జీవన్ జ్యోతి బీమా స్కీమ్ కింద ఏడాదికి రూ.330 చెల్లించాల్సి ఉంటుంది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. పాలసీదారుడు మరణిస్తే.. కుటుంబానికి రూ.2 లక్షలు వస్తాయి. అలాగే ప్రధాన్‌మంత్రి సురక్ష బీమా యోజన అనేది ప్రమాద బీమా. దీనికి ఏడాదికి రూ.12 కట్టాలి. ప్రమాదంలో మరణించినా, లేదంటే అంగవైకల్యం సంభవించినా రూ.2 లక్షల వరకు వస్తాయి.

పీఎం జీవన్‌ సురక్ష యోజన పాలసీ ఎవరెవరు తీసుకోవచ్చు..

ఈ పాలసీని 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు తీసుకోవచ్చు. ఇందులో బీమా చేసినవారి బ్యాంక్ ఖాతా నుండి ప్రతి సంవత్సరం 12 రూపాయల ప్రీమియం కట్ అవుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి:

పీఎం సురక్ష బీమా యోజన కింద దరఖాస్తు చేసుకోవటానికి పాలసీదారుడు క్రియాశీల పొదుపు బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయడం తప్పనిసరి. అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, వయస్సు ధృవీకరణ పత్రం మరియు ఆధాయ ధృవీకరణ పత్రం యొక్క ఫోటోకాపీని తయారు చేసి పాస్‌పోర్ట్ సైజు ఫోటోను ఉంచండి.

ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా ఎవరెవరు తీసుకోవచ్చు:

ఈ పాలసీలో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్నవాళ్లు చేరవచ్చు. ఏ కార‌ణంతో మృతి చెందినా నామినీకి రూ.2 లక్షలు చెల్లిస్తారు. ఏడాదికి ఒక‌సారి ఏక‌మొత్తంలో ప్రీమియం వ‌సూలు చేస్తారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం టర్మ్ ప్లాన్ మెచ్యురిటీ గడువు 55 ఏళ్ల వయసులో ముగుస్తుంది. ఇన్సూరెన్స్ చేస్తున్న సమస్యంలో టర్మ్ మధ్యలోనే ఆ ఖాతాదారుడు చనిపోతే రూ.2 లక్షల నగదు నామినీకి అందజేస్తారు. అందుకోసం నామినీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయడం తప్పనిసరి. అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, వయస్సు ధృవీకరణ పత్రం మరియు ఆధాయ ధృవీకరణ పత్రం, ఫోటోలు బ్యాంకులో సమర్పించాలి. ఇలాంటి పాలసీలు తీసుకుంటే ఎన్నో ఉపయోగాలుంటాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు, ఇతర ఇన్సూరెన్స్‌ పాలసీలు ఆఫర్‌ చేస్తున్నాయి. గతంలో ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోని వారు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. కరోనా మహహ్మారి కాలంలో పాలసీల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా రూపొందిస్తున్నాయి సంస్థలు.

 

ఇవీ కూడా చదవండి:

SBI Offer: కస్టమర్లకు ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌.. షాపింగ్‌ చేస్తే 10 వేల వరకు క్యాష్‌బ్యాక్‌.. ఎలాగంటే..!

Google Pay: ఆ సేవలపై వెనుకడుగు వేస్తున్న గూగుల్‌ పే.. ఇలా అయితే బ్యాంకులకు నష్టమే..!