Anil Ambani: అనిల్ అంబానీకి గట్టి షాకిచ్చిన సెబీ.. ఐదేళ్ల పాటు నిషేధం.. రూ.25 కోట్ల జరిమానా

|

Aug 23, 2024 | 2:15 PM

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అనిల్ అంబానీ సహా మరో 24 సంస్థలు నిషేధించబడ్డాయి. ఈ సంస్థలపై సెక్యూరిటీ మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. నిషేధంతో పాటు రూ.25 కోట్ల పెనాల్టీని కూడా సెబీ విధించింది. ఈ నిషేధం తర్వాత,..

Anil Ambani: అనిల్ అంబానీకి గట్టి షాకిచ్చిన సెబీ.. ఐదేళ్ల పాటు నిషేధం.. రూ.25 కోట్ల జరిమానా
Anil Ambani
Follow us on

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అనిల్ అంబానీ సహా మరో 24 సంస్థలు నిషేధించబడ్డాయి. ఈ సంస్థలపై సెక్యూరిటీ మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. నిషేధంతో పాటు రూ.25 కోట్ల పెనాల్టీని కూడా సెబీ విధించింది. ఈ నిషేధం తర్వాత, అనిల్ అంబానీ ఇకపై సెక్యూరిటీ మార్కెట్‌లో పాల్గొనలేరు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రూ. 6 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ కంపెనీపై 6 నెలల నిషేధం విధించింది.

ఎందుకు నిషేధించారు?

కంపెనీ నుండి నిధుల మళ్లింపు ఆరోపణలపై సెబి వారిపై ఈ కీలక చర్య తీసుకుంది. సెబీ అనిల్ అంబానీకి రూ. 25 కోట్ల జరిమానా విధించింది. అలాగే ఐదేళ్ల పాటు ఏదైనా లిస్టెడ్ కంపెనీలో లేదా ఏదైనా మధ్యవర్తిగా సెక్యూరిటీస్ మార్కెట్‌లో డైరెక్టర్‌గా లేదా కీలకమైన మేనేజర్‌గా పాల్గొనకుండా నిషేధించింది.

షేర్లలో భారీ పతనం

సెబీ నుంచి ఈ వార్త వచ్చిన వెంటనే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్‌లో భారీ క్షీణత నమోదైంది. మధ్యాహ్నం 12 గంటలకు రిలయన్స్ పవర్ షేర్లు 5 శాతానికి పైగా పడిపోయాయి. రిలయన్స్ పవర్ షేర్లు గత 3 రోజులుగా బలమైన పెరుగుదలను నమోదు చేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి