తిరుపతి వెళ్లే వారికి గుడ్‌న్యూస్..! మూడు స్పెషల్ ట్రైన్స్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే! టైమ్ టేబుల్ ఇదే..
దక్షిణ మధ్య రైల్వే రద్దీ రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించి ప్రయాణికులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా హైదరాబాద్ - తిరుపతి మార్గంలో ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగకరం. 07000 తిరుపతి - చర్లపల్లి, 07031 చర్లపల్లి - తిరుపతి, 07032 పంఢర్‌పూర్ - తిరుపతి రైళ్లకు సంబంధించిన తేదీలు, సమయాలు ఇవే.

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. బాగా రద్దీగా ఉండే రూట్లలో స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ – తిరుపతి మధ్య ప్రయాణించే వారికి చాలా ఉపయోగపడనుంది. మరి ఆ ట్రైన్ వివరాలు ఇలా ఉన్నాయి. 07000 నంబర్ గల తిరుపతి నుంచి చర్లపల్లి మధ్య (మంగళవారం) 16.30 గంటలు తిరుపతి నుంచి బయలుదేరి 08.15 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. 16.12.2025 నుండి 30.12.2025 వరకు అందుబాటులో ఉండనుంది. 07031 చర్లపల్లి – తిరుపతి (శుక్రవారం) 15.35 గంటలకు బయలుదేరి 06.40 గంటలకు చేరుకోనుంది. 19.12.2025 నుండి 02.01.2026 మధ్య నడవనుంది. 07032 పంధర్‌పూర్ టూ తిరుపతి (ఆదివారం) 20.00 గంటలకు బయలుదేరి 22.30 గంటలకు చేరుకోనుంది. 21.12.2025 నుండి 04.01.2026 వరకు నడవనుంది.
ఏ ట్రైన్ ఏఏ స్టేషన్స్‌లో ఆడుతుంది?
రైలు నంబర్ 07000 తిరుపతి – చర్లపల్లి ప్రత్యేక రైళ్లు రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, ప్రొద్దుటూరులో ఆగుతుంది. అలాగే జమ్మలమడుగు, నంద్యాల, దిగువమెట, గిద్దలూరు, కుంబం, మార్కాపూర్ రోడ్డు, దొనకొండ, వినుకొండ, రొంపిచెర్ల, నెమలిపురి, పిడుగురాళ్ల, నడికుడే, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో హాల్టింగ్ ఉంది.
రైలు నంబర్ 07031 చర్లపల్లి – తిరుపతి ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, ధోనే, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నంబర్ 07032 పంఢర్‌పూర్ – తిరుపతి ప్రత్యేక రైళ్లు కుర్దువాడి, లాతూర్, లాతూర్ రోడ్, ఉద్గీర్, భాల్కీ, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, శంకరపల్లి, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, సత్తెనపల్లె, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీ కాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




