Telugu News Business Sbi will offer pre approved loans for all salaried people via yono app this is what we know so far
ఖాతాదారులకు గుడ్‌న్యూస్ః ఉద్యోగస్తులకు వ్యక్తిగత రుణాలు
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘యోనో’ ద్వారా ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తోంది.
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికి ఆదాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘యోనో’ ద్వారా ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలను అందజేయనున్నట్లు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తెలిపింది. ఈ మేరకు ఆ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో… తమ బ్యాంక్ లో ఖాతా కలిగిన వినియోగదారులకు వ్యక్తిగత రుణాలు అందించే పథకాన్ని చేపట్టనున్నామన్నారు. ఈ పథకం ఎస్‌బీఐ ‘యోనో’ యాప్ ద్వారా జూన్ వరకు అమలులో ఉంటుందని చెప్పారు. కనిష్టంగా రూ.25 వేల నుంచి గరిష్టంగా రూ.3 లక్షల రుణాలు పొందవచ్చని, 18 నెలల్లోపు రుణాలను తిరిగి చెల్లించాలని, వేతన ఖాతాదారులకు మాత్రమే ఈ రుణాలు అందజేయనున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది.