SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
SBI PAN Aadhaar linking: బ్యాంకు ఖాతాలన్నీ డిజటలైజ్ చేసేందుకు ఎస్‌బీఐ ఎప్పటికప్పుడు.. ఖాతాదారులకు సూచనలు చేస్తుంది. తాజాగా ఎస్‌బీఐ మరోసారి ఖాతాదారులకు అలెర్ట్ జారీ చేసింది.
SBI PAN Aadhaar linking: దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లావాదేవీలను మరింత సులభం చేసేందుకు పలు కీలక సంస్కరణలకు నాంది పలుకుతోంది. బ్యాంకు ఖాతాలన్నీ డిజటలైజ్ చేసేందుకు ఎస్‌బీఐ ఎప్పటికప్పుడు.. ఖాతాదారులకు సూచనలు చేస్తుంది. తాజాగా ఎస్‌బీఐ మరోసారి ఖాతాదారులకు అలెర్ట్ జారీ చేసింది. మీరు స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులైతే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. అదేంటో తెలుసుకుందాం.. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేయాలని సూచించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విట్ చేసి వెల్లడించింది. లావాదేవీల్లో ఎలాంటి అసౌకర్యాలనైనా నివారించడానికి.. అంతరాయం కలగకుండా బ్యాంకింగ్ సేవను ఆస్వాదించడానికి తమ కస్టమర్‌లు వారి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలంటూ సలహా ఇచ్చింది. ఒకవేళ లింక్ చేయకపోతే పాన్ ఆపరేటివ్/ఇన్యాక్టివ్‌గా మారుతుందని.. దీనివల్ల లావాదేవీలను నిర్వహించలేరంటూ హెచ్చరించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. మార్చి 31, 2022లోగా ఆధార్ నంబర్‌కు శాశ్వత ఖాతా నంబర్ (పాన్) ను లింక్ చేయాలని సూచించింది. పైన పేర్కొన్న తేదీలోగా మీ పాన్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడకపోతే.. ఏప్రిల్ నుంచి మీ ఖాతాల్లో లావాదేవీలను నిర్వహించలేరంటూ వెల్లడించింది. కాగా.. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని గతంలో పలుమార్లు పేర్కొన్నప్పటికీ.. కరోనా కారణంగా దీని గడువును పొడగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లింక్ చేయని ఖాతాదారులకు.. ఎస్‌బీఐ మరోసారి సూచనలు చేసింది.
పాన్ ఆధార్‌తో లింక్ అయిందో లేదో ఇక్కడ తెలుసుకోండి..
➼ www.incometax.gov.inని సందర్శించండి
➼ ‘క్విక్ లింక్స్’ హెడ్ కింద, ‘లింక్ ఆధార్ స్టేటస్’ ఎంపికపై క్లిక్ చేయండి.
➼ కొత్త పేజీలో మీ పాన్, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి
➼ ‘వ్యూ లింక్ ఆధార్ స్టేటస్’పై క్లిక్ చేయండి.
➼ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసి ఉందో లేదో అనే విషయం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
మీరు మీ పాన్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలో ఇక్కడ చూడిండి..
➼ https:// incometaxindiaefiling.gov.in/ వెబ్‌సైట్‌లో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వండి
➼ మెనూ బార్‌లోని ప్రొఫైల్ సెట్టింగ్ లోకి వెళ్లి.. ‘లింక్ ఆధార్’పై క్లిక్ చేయండి.
➼ పాన్‌లో ఉన్న వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు నమోదు చేయండి.
➼ మీ ఆధార్‌లో ఉన్న పాన్ వివరాలను స్క్రీన్‌పై తనిఖీ చేయండి. సరిపోలని పక్షంలో.. మీరు దానిని రెండు డాక్యుమెంట్‌లలో తప్పనిసరిగా ఎంటర్ చేయడాల్సి ఉంటుంది.
➼ ఒకవేళ వివరాలు సరిపోలితే.. మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి “లింక్ నౌ” బటన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఆధార్‌కు పాన్ అనుసంధానం అయినట్లు మెస్సెజ్ కనిపిస్తుంది.
మెస్సెజ్‌తో కూడా లింక్..
దీంతోపాటు.. ఒక సాధారణ SMS ద్వారా కూడా మీరు మీ పాన్ – ఆధార్‌ను లింక్ చేయవచ్చు. 567678 లేదా 56161కి నిర్దిష్ట ఫార్మాట్లో అంకెలను టైప్ చేసి SMS పంపండి. ఉదాహరణకు.. మీ ఆధార్ నంబర్ XXXXXXXX3333 – PAN XXXXXX999Q అయితే. అప్పుడు మీరు UIDPAN XXXXXXXX3333 XXXXXX999Q అని టైప్ చేసి 567678 లేదా 56161కి ఎస్ఎంఎస్ పంపాలి.
Also Read: