SBI FD Interest Rates: మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా..? ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రకటించిన బ్యాంక్.. వివరాలు..

|

Apr 22, 2021 | 4:02 PM

SBI Fixed Deposit Interest Rates: బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే.. వడ్డీ రేట్లు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఒక్కోసారి పాత వడ్డీ రేట్లనే

SBI FD Interest Rates: మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా..? ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రకటించిన బ్యాంక్.. వివరాలు..
SBI FD Interest Rates
Follow us on

SBI Fixed Deposit Interest Rates: బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే.. వడ్డీ రేట్లు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఒక్కోసారి పాత వడ్డీ రేట్లనే బ్యాంకులు కొనసాగిస్తుంటాయి. దీనికోసం ఆయా బ్యాంకుల ఖాతాదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తరచూ వడ్డీ రేట్లను చెక్ చేసుకుంటుంటారు. అయితే.. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిక్స్‌డ్ డిపాజిట్లపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు వడ్డీ రేట్లు వేర్వేరు విధంగా ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం ఎంచుకున్న కాలాన్ని బట్టి వడ్డీ జమవుతుంటుంది. సీనియర్ సిటిజన్లకు అరశాతం వడ్డీ ఎక్కువ వస్తుంది. అయితే.. ఈ వడ్డీని నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి పొందవచ్చు. ఎప్పటికప్పుడు ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో తాజా వడ్డీ రేట్లను ప్రకటిస్తూ ఉంటుంది. దానిలో భాగంగా ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రకటించింది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఉన్న తాజా వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి.

ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు..

7 రోజుల నుంచి 45 రోజుల వరకు- 2.9 శాతం,
46 రోజుల నుంచి 179 రోజులు- 3.9 శాతం
180 రోజుల నుంచి 210 రోజులు- 4.4 శాతం
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.4 శాతం
ఏడాది నుంచి రెండేళ్లు- 5 శాతం
రెండేళ్ల నుంచి మూడేళ్లు- 5.1 శాతం
మూడేళ్ల నుంచి ఐదేళ్లు- 5.3 శాతం
ఐదేళ్ల నుంచి పదేళ్లు- 5.4 శాతం వడ్డీ రేటుగా ప్రకటించింది.

కాగా.. ఎస్‌బీఐలో సీనియర్ సిటిజన్లకు అర శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. అంటే సాధారణ ఖాతాదారులకు లభించే వడ్డీ కన్నా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ అదనంగా పొందవచ్చు.
సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేట్లు..
7 రోజుల నుంచి 45 రోజులు- 3.4 శాతం, 46 రోజుల నుంచి 179 రోజులు- 4.4 శాతం, 180 రోజుల నుంచి 210 రోజులు- 4.9 శాతం, 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 4.9 శాతం, ఏడాది నుంచి రెండేళ్లు- 5.5 శాతం
రెండెళ్ల నుంచి మూడేళ్లు- 5.6 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లు- 5.8 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్లు- 6.2 శాతంగా ఎస్‌బీఐ ప్రకటించింది.

Also Read:

Covid-19: పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం..