SBI: మీ ఫోన్‌లో యోనో యాప్‌ ఉందా.? మీ కోసమే ఈ కొత్త సర్వీస్‌..

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ వినియోగదారుల కోసం యోనో సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ యాప్‌ ద్వారా ఖాతాదారులకు లోన్‌ మొదలు స్టేట్‌మెంట్‌ వరకు ఎన్నో రకాలు సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారుల సౌలభ్యం కోసం ఎస్‌బీఐ యోనో యాప్‌లో మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. యోనోలో యూపీఐ సేవలను అందిస్తోంది...

SBI: మీ ఫోన్‌లో యోనో యాప్‌ ఉందా.? మీ కోసమే ఈ కొత్త సర్వీస్‌..
Yono App
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 03, 2023 | 8:09 AM

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ వినియోగదారుల కోసం యోనో సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ యాప్‌ ద్వారా ఖాతాదారులకు లోన్‌ మొదలు స్టేట్‌మెంట్‌ వరకు ఎన్నో రకాలు సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారుల సౌలభ్యం కోసం ఎస్‌బీఐ యోనో యాప్‌లో మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. యోనోలో యూపీఐ సేవలను అందిస్తోంది.

ఐసీఐసీఐ, యాక్సిస్‌ వంటి ప్రైవేటు బ్యాంకులకు పరిమితమైన ఈ యూపీఐ సేవలను ఎస్‌బీఐ సైతం తీసుకొచ్చింది. ఈ కొత్త సేవలతో యూజర్లు తమ యోనో యాప్‌ ద్వారా స్కాన్‌ చేసి పేమెంట్స్‌ చేసుకోవచ్చు. అలాగే ఇతర యూపీఐ యాప్స్‌లో ఉన్నట్లుగానే.. పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సేవలను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా కార్డు అవసరం లేకుండానే ఏటీఎమ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది.

క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించారు. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 68వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సర్వీసును తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇతర బ్యాంకుల కస్టమర్స్‌ కూడా యోనో యాప్‌ ద్వారా సేవలు పొందే అవకాశం ఇచ్చారు. ప్రస్తుతానికి యూపీఐ సేవలపై సర్వీస్‌ ఛార్జీలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త