SBI Loans: వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… అతి తక్కువ వడ్డీకే రుణాల అందజేత

వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారు కూడా చిన్న చిన్న ఇబ్బందులకు గురికాకుండా వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపార విస్తరణకు సొమ్ము దొరక్క ఇబ్బందిపడేవారికి వ్యక్తిగత రుణాలు చాలా ఉపశమనాన్ని అందిస్తాయి. ఇలాంటి వారి కోసం భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ మీకు తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాన్ని అందిస్తోంది. ముఖ్యంగా నిర్ణీత కాలానికి లోన్ తీసుకుని, అవసరాలను తీర్చుకోవచ్చు.

SBI Loans: వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… అతి తక్కువ వడ్డీకే రుణాల అందజేత
Sbi

Updated on: May 20, 2024 | 8:30 PM

భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు సులభమైన నిబంధనలపై వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా తమ అనుకోని అవసరాలను తీర్చుకోవాలనే వినియోగదారులకు వ్యక్తిగత రుణాలు వెన్నుదన్నుగా నిలుస్తాయి. అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారు కూడా చిన్న చిన్న ఇబ్బందులకు గురికాకుండా వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపార విస్తరణకు సొమ్ము దొరక్క ఇబ్బందిపడేవారికి వ్యక్తిగత రుణాలు చాలా ఉపశమనాన్ని అందిస్తాయి. ఇలాంటి వారి కోసం భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ మీకు తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాన్ని అందిస్తోంది. ముఖ్యంగా నిర్ణీత కాలానికి లోన్ తీసుకుని, అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత రుణాలను తీసుకునేందుకు ఎలాంటి పత్రాలు అవసరం? అలాగే వడ్డీ రేటు విషయంలో కీలక విషయాలను తెలుసుకుందాం. 

వడ్డీ రేట్లు

లోన్ తీసుకోవడానికి వెళ్లినప్పుడు వడ్డీ రేట్లు విషయంలో ప్రతి ఒక్కరూ సంశయిస్తూ ఉంటారు. కాబట్టి ఎస్‌బీఐ నుంచి పర్సనల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఎస్‌బీఐ రుణం అందించే సమయంలో మీ సిబిల్ స్కోర్‌కు అనుగుణంగా మీ వడ్డీ రేటును నిర్ణయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ వడ్డీ అనే 8.00 శాతం నుంచి 13.5 శాతం వరకూ ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

లోన్ కోసం అవసరమైన పత్రాలు

  • ఆధార్ కార్డ్
  • పాన్ కార్డ్
  • బ్యాంక్ పాస్ బుక్
  • శాలరీ స్లిప్
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • మొబైల్ నంబర్
  • ఈ-మెయిల్ ఐడీ
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్

లోన్ అప్లయ్ చేయడం ఇలా

  • ముందుగా మీరు ఎస్‌బీఐ నుంచి రుణం తీసుకోవడానికి అవసరమైన పత్రాలను సేకరించి వాటి ఫైల్‌ను రూపొందించాలి.
  • అనంతరం మీ సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కి వెళ్లాలి.
  • బ్యాంకుకు వెళ్లిన తర్వాత మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారని అక్కడి ఉద్యోగులకు చెప్పాలి.
  • అక్కడి ఉద్యోగులు మీకు లోన్ ఫారమ్ అందిస్తారు.
  • మొదట లోన్ ఫారమ్‌ను జాగ్రత్తగా చదవాలి. అలాగే దాని నిబంధనలు, షరతుల గురించి అంచనా వేయాలి
  • అనంతరం ఆ దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలి.
  • మీరు ఫారమ్ వెనుక భాగంలో మీ అన్ని పత్రాల ఫోటోకాపీలను జతచేయాలి.
  • మీరు ఫారమ్‌పై ఎక్కడ సంతకం చేయాల్సి వస్తే మీరు దానిపై సంతకం చేసి, ఫారమ్‌ను బ్యాంకుకు సమర్పించాలి.
  • బ్యాంక్ ఉద్యోగులు మీ ఫారమ్‌ను తనిఖీ చేసి మీరు రుణం తీసుకోవడానికి అర్హులైతే మీ బ్యాంక్ ఖాతాకు లోన్ మొత్తం బదిలీ చేస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి