YONO Super Saving Days : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ పేరుతో స్పెషల్ షాపింగ్ కార్నివాల్‌ను మొదలు పెట్టింది. తన బ్యాంకింగ్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫాం యోనో యాప్ ద్వారా షాపింగ్ చేసిన కస్టమర్లకు స్పెషల్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇందుకోసం అమెజాన్, ఓయో, పెప్పర్‌ఫ్రై, శాంసంగ్, యాత్రతో సహా 100కి పైగా ఇ-కామర్స్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ వివరాలను మంగళవారం ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ఫిబ్రవరి 4న ప్రారంభమై ఫిబ్రవరి 7వరకు యోనో సూపర్ సేవింగ్ డేస్ అమ్మకాలు కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ, అమెజాన్‌తో ఆన్‌లైన్ షాపింగ్, ఇతర ప్రముఖ విభాగాలలో యోనో సూపర్ సేవింగ్ డేస్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఓయో హోటల్ బుకింగ్‌పై 50 శాతం తగ్గింపు ఉంటుంది.
యోనో యాప్‌లోని యాత్రా.కామ్ ద్వారా ఫ్లైట్ బుకింగ్ చేసుకుంటే.. 10శాతం వరకు తగ్గింపును ఇస్తోంది. అంతేకాదు శాంసంగ్ మొబైల్స్, టాబ్లెట్‌లు గడియారాలపై 15శాతం తగ్గింపుతో పాటు ఇతర ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. దీంతోపాటు పెప్పర్‌ఫ్రై ఫర్నిచర్ కొనుగోలు చేస్తే 7 శాతం మినహాయింపు లభించనుంది.
అమెజాన్‌లో ఎంపిక చేసిన వస్తువులపై షాపింగ్‌పై 20 శాతం క్యాష్‌బ్యాక్ లభ్యం జరుగుతోంది. ఈ కొత్త ఏడాదిలో తమ వినియోగదారులకు మరింత సంతోషాన్ని అందించేందుకు యోనో సూపర్ సేవింగ్ డేస్ ప్రకటించడం ఆనందంగా ఉందని ఎస్‌బీఐ ఎండీ సీఎస్ శెట్టి తెలిపారు. బ్యాంకింగ్, జీవనశైలి అవసరాల దృష్ట్యా అదనపు షాపింగ్ అవసరాలను తీర్చే క్రమంలో మెగా షాపింగ్ ఈవెంట్ ఒక ప్రత్యేక అడుగు అని ఆయన అన్నారు.
Save the dates! YONO Super Saving Days brings exclusive discounts on top brands like Amazon, Samsung, Yatra, OYO & Pepperfry. Stay tuned!#SuperSavingDays #YONOSBI #YONO pic.twitter.com/DCA02P60kW
— State Bank of India (@TheOfficialSBI) February 1, 2021
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..