AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: 1983 తర్వాత ఇదే అతిపెద్ద క్రాష్.! బంగారం, వెండి ధరల్లో బబుల్ బరస్ట్.. కొంపలు అంటుకుంటున్నాయ్

గత వారం నుంచి బంగారం పతనం ప్రారంభమైంది. బహుశా 1983 అంటే సరిగ్గా 40ఏళ్ల తర్వాత చరిత్రలో ఇదే అతిపెద్ద పతనం అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఒక్క వారం వ్యవధిలోనే బంగారం ధర 12 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో బంగారం పెరగాలి కానీ ఈసారి సెంటిమెంట్ పూర్తిగా మారిపోయింది. వెండి కూడా మరింతగా కుదేలైంది.

Gold Price: 1983 తర్వాత ఇదే అతిపెద్ద క్రాష్.! బంగారం, వెండి ధరల్లో బబుల్ బరస్ట్.. కొంపలు అంటుకుంటున్నాయ్
Ravi Kiran
|

Updated on: Mar 23, 2026 | 9:08 PM

Share

యుద్ధానికి బ్రేక్ పడింది. ఆయిల్ ధరల కూడా పెరిగినట్టే పెరిగి, ట్రంప్ ప్రకటన తర్వాత ఏక్‌దమ్ కిందకుపడిపోయాయి. ఇటు మార్కెట్లు సైతం ఊపిరిపీల్చుకున్నాయి. కానీ బంగారం మాత్రం గత వారంరోజులుగా ఇన్వెస్టర్లకు పెద్దషాక్ ఇస్తూ వస్తోంది. వారం ముందు బంగారం ఎవరెస్ట్‌ ఎక్కి దిగనంటే దిగనంటూ బింకాలు పోయింది. పైగా యుద్ధం. ఈదెబ్బతో హిస్టరీ చూడని హైస్ టచ్ చేస్తుందని భావించారు. కానీ అదంతా గాలిబుడగేనని తేలింది. అది బలుపు కాదు వాపని తేల్చేశాడు ఇన్వెస్టర్. ఒక్క దెబ్బతో బంగారం బుడగ పేలిపోయింది. ఇవాళ ఒక్కరోజే ఎంతకు పడిపోయిందో తెలుసా..10శాతం..అంటే దాదాపు 10వేలు తగ్గిపోయింది. ఇది ఎవరూ ఊహించని షాక్ . నెలకిందట బంగారం కొన్నవాళ్లకైతే మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ న్యూస్ ఇది. అటు యుద్ధభయం ఉన్నా..గోల్డ్ ఎందుకు ఇంతలా పడిపోయింది..? సేఫ్ హెవెన్‌ కాస్తా ఎందుక టఫ్‌ గా మారింది.?

గత వారం నుంచి బంగారం పతనం ప్రారంభమైంది. బహుశా 1983 అంటే సరిగ్గా 40ఏళ్ల తర్వాత చరిత్రలో ఇదే అతిపెద్ద పతనం అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఒక్క వారం వ్యవధిలోనే బంగారం ధర 12 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో బంగారం పెరగాలి కానీ ఈసారి సెంటిమెంట్ పూర్తిగా మారిపోయింది. వెండి కూడా మరింతగా కుదేలైంది. మార్చి 16నుంచి బంగారం రేట్లు ఎందుకు పడిపోయాయో ఒకసారి విశ్లేషిస్తే.. చమురు ధరలు పెరగడం మొదట్లో బంగారానికి అనుకూలంగా కనిపించినా ఇప్పుడు అదే ప్రతికూలంగా మారింది. ద్రవ్యోల్బణం పెరిగితే సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించవు అన్న అంచనాలు బలపడాయి. కొన్ని సందర్భాల్లో రేట్లు పెరగవచ్చనే సంకేతాలు కూడా వచ్చాయి. ఈమొత్తం పరిణామాలు బంగారంపై అనుమానాలు పెరిగేలా చేసింది.

నెలకిందట యుద్ధభయంతో బంగారం మరింత పెరగవచ్చేమోనన్న భయంతో గోల్డ్‌పై పెట్టుబడులు భారీగా పెట్టారు. ఇప్పుడు కూడా యుద్ధం కారణంగా ఇన్‌ఫ్లయేషన్ పెరగవచ్చనే భయంతో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. సో..భయమే బంగారాన్ని హైకు చేర్చుతోంది, కిందకు పడవేస్తోంది. మరి రాబర్ట్ కియోసాకి అనే ఎక్స్‌పర్ట్స్ మాత్రం వచ్చే ఏడాదికి బంగారం పదింతల రేటు పెరుగుతుందన్న అంచనాలు వేశారు. సో..ఏడాదిలో గోల్డ్ బబుల్ మరింత ఉబ్బి, ఊహించని విధంగా బ్లాస్ట్ అవుతుందన్నది కియోసాకి లాంటి ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న విశ్లేషణ. దీర్ఘకాల దృష్టిలో చూస్తే పరిస్థితి పూర్తిగా నెగెటివ్ కాదు. ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగానే ఉంది. గ్లోబల్ టెన్షన్స్ తగ్గలేదు. ఇవి బంగారానికి మళ్లీ సపోర్ట్ ఇవ్వొచ్చని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం. ఇప్పటికే ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా బ్రేక్ ఇవ్వడంతో కొన్ని క్షణాల్లోనే ఆయిల్ ధరలు 12శాతం తగ్గాయి. ఇటు మార్కెట్లలో రేపట్నుంచి ర్యాలీ కొనసాగే చాన్స్ ఉండడంతో బంగారానికి మళ్లీ రెక్కలు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది చదవండి: చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.! ఎవ్వరికీ తెలియని నిజం

Follow Us