Russia-Ukraine War: ఆల్‌టైం రికార్డు దిశగా క్రూడ్ ఆయిల్ ధరలు.. భార‌త్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్..

|

Feb 24, 2022 | 4:48 PM

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. రష్యా గర్జిస్తోంది. యుద్ధ కాంక్షతో రగులుతోంది. ఉక్రెయిన్‌పై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రష్యా ఎటాక్స్‌తో నిలువెల్లా వణుకుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి..  యుద్ధ అవకాశాల కారణంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 101 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది.

Russia-Ukraine War: ఆల్‌టైం రికార్డు దిశగా క్రూడ్ ఆయిల్ ధరలు.. భార‌త్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్..
Petrol Diesel Prices
Follow us on

రష్యా(Russia), ఉక్రెయిన్‌ల(Ukraine) మధ్య యుద్ధ వాతావరణం(War) కొనసాగుతోంది. రష్యా గర్జిస్తోంది. యుద్ధ కాంక్షతో రగులుతోంది. ఉక్రెయిన్‌పై ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రష్యా ఎటాక్స్‌తో నిలువెల్లా వణుకుతోంది ఉక్రెయిన్‌. దేశప్రజలు ద్రవ్యోల్బణంతో పెద్ద దెబ్బ తినబోతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధభేరి మోగించడంతో.. ఇవాళ మార్కెర్లు రికార్డు స్థాయిలో పతనమవడం చూస్తే అది నిజమే అనిపిస్తోంది. డ్రా డౌన్‌లో గురువారం ఆల్‌టైం రికార్డు సృష్టించిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ ప్రభావం పెట్రోల్ ధరలపై పడింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి..  యుద్ధ అవకాశాల కారణంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 101 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. 2014 సెప్టెంబర్ తర్వాత ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరడం ఇదే తొలిసారి.

రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం పూర్తిగా చెలరేగితే ముడి చమురు మరింత ప్రియంగా మారుతుంది. ముడి చమురు ధరలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ పరిశోధనా సంస్థల ప్రకారం.. ముడి చమురు ధర $100 కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ముడి చమురు ధర మరింత పెరగవచ్చు. 2022లో ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్లు గోల్డ్‌మన్ సాచ్స్ పేర్కొంది. అదే సమయంలో JP మోర్గాన్ 2022 లో బ్యారెల్ ధర $ 125,  2023 లో $ 150 వరకు ఉంటుందని అంచనా వేసింది.

రెండు నెలలుగా ధరలు మండిపోతున్నాయి..

ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. 2022లో ముడి చమురు ధరలు 25 శాతానికి పైగా పెరిగాయి. గత రెండు నెలలుగా ముడి చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. డిసెంబర్ 1, 2021 న, ముడి చమురు ధర బ్యారెల్‌కు $ 68.87. ఇది ఇప్పుడు బ్యారెల్‌కు $100 స్థాయిలో ట్రేడవుతోంది. అంటే నెలన్నర వ్యవధిలోనే ముడి చమురు ధరలు దిగువ స్థాయి నుంచి 40 శాతం పెరిగాయి.

పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు..

కానీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేనప్పటికీ యుద్ధం ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నవంబర్ 4, 2021 నుండి పెట్రోల్ , డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాని ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. నిజానికి దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. ఎన్నికల్లో నష్టం వాటిల్లడంతో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగినా ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయడం లేదని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నష్టాలను పూడ్చుకునేందుకు ధరలను కచ్చితంగా పెంచుతాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

ఏడేళ్లలో పెరిగిన పెట్రోలు ధరలు…

2014 మే పెట్రోలు ధర 71.41- డీజిల్‌ – 56.71- క్రూడ్‌ ధర 106.85 డాలర్లు
2019 మే పెట్రోలు ధర – 71.86, డీజిల్‌ – 66.69 – క్రూడ్‌ ధర 71.32 డాలర్లు
2020 డిసెంబర్‌ పెట్రోల్‌ ధర – 90.34, డీజిల్‌ – 80.51- క్రూడ్‌ ధర 49.99 డాలర్లు)
2021 నవంబర్‌ 1 -పెట్రోలు ధర – 114.12, డీజిల్‌ – 107.40 – క్రూడ్‌ ధర 82.31 డాలర్లు
————————————————————-
2021 నవంబర్‌ 4న పెట్రోలు ధర – 108.20, డీజిల్‌ – 94.62 (హైదరాబాద్‌)
2021 నవంబర్‌ 4న పెట్రోలు ధర – 110.67, డీజిల్‌ – 96.08 (అమరావతి

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: ప్రధాని మోడీని సహాయం కోరిన ఉక్రెయిన్.. గ్రౌండ్ జీరో నుంచి టీవీ9 రిపోర్టింగ్