UPI Rule Change: యూపీఐ లావాదేవీల్లో నేటి నుండి పెద్ద మార్పు.. రూ.10 లక్షల వరకు లావాదేవీలు!

UPI చెల్లింపుల కోసం కొత్త పరిమితి వ్యక్తి నుండి వ్యాపారికి (P2M) చెల్లింపులపై అమలులోకి వస్తుంది. అంటే ఈ మార్పు ధృవీకరించబడిన వ్యాపారులు,సంస్థలకు చెల్లింపులపై వర్తిస్తుంది. దీని కింద కొన్ని వర్గాలలో గరిష్టంగా రూ. 5 లక్షలు, మరికొన్నింటిలో గరిష్టంగా రూ..

UPI Rule Change: యూపీఐ లావాదేవీల్లో నేటి నుండి పెద్ద మార్పు.. రూ.10 లక్షల వరకు లావాదేవీలు!

Updated on: Sep 15, 2025 | 11:46 AM

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనేక వర్గాలలో UPI లావాదేవీల పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది నేటి నుంచి అమలులోకి రానుంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ద్వారా అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసే దిశగా ఒక పెద్ద అడుగు వేస్తూ, NPCI లావాదేవీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది.

UPI చెల్లింపు నియమాలలో ఈ ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ 15, 2025 నుండి అమల్లోకి వస్తున్నాయి. దీని తర్వాత ఇప్పుడు బీమా, మూలధన మార్కెట్, లోన్ EMI, ప్రయాణ వర్గాలలో ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు. అయితే రోజుకు రూ.10 లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Indian Railways: అత్యవసర పరిస్థితుల్లో టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయవచ్చా? రైల్వే నియమాలు ఏంటి?

ఇవి కూడా చదవండి

కొత్త పరిమితి ఎక్కడ వర్తిస్తుంది?

UPI చెల్లింపుల కోసం కొత్త పరిమితి వ్యక్తి నుండి వ్యాపారికి (P2M) చెల్లింపులపై అమలులోకి వస్తుంది. అంటే ఈ మార్పు ధృవీకరించబడిన వ్యాపారులు,సంస్థలకు చెల్లింపులపై వర్తిస్తుంది. దీని కింద కొన్ని వర్గాలలో గరిష్టంగా రూ. 5 లక్షలు, మరికొన్నింటిలో గరిష్టంగా రూ. 10 లక్షలు రోజుకు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: ITR Deadline Extension: ఐటీఆర్‌ గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించారా?

ఆగస్టు 24న జారీ చేసిన సర్క్యులర్‌లో NPCI ఈ మార్పు గురించి తెలియజేసింది. అాగే యూపీఐ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత గల చెల్లింపు విధానంగా మారిందని, పెద్ద లావాదేవీలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, యూపీఐ చెల్లింపు రోజువారీ పరిమితిని పెంచే ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పెరిగిన పరిమితి రూ. 5 లక్షల వరకు పన్ను చెల్లింపు వర్గంలోకి వచ్చే సంస్థలకు వర్తిస్తుంది.

P2P చెల్లింపు పరిమితిలో మార్పు లేదు:

పర్సన్-టు-పర్సన్ (P2P) ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి డబ్బు పంపే పరిమితిలో ఎటువంటి మార్పు లేదని, ఇది మునుపటిలాగే రోజుకు లక్ష రూపాయలుగానే ఉండనుంది.

 

మూలధన మార్కెట్ పెట్టుబడులు ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షలు రోజువారీ పరిమితి రూ. 10 లక్షలు.
బీమా చెల్లింపు ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షలు రోజువారీ పరిమితి రూ. 10 లక్షలు.
జిఇఎం లావాదేవీలు ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షలు రోజువారీ పరిమితి రూ. 10 లక్షలు.
ప్రయాణ చెల్లింపు ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షలు రోజువారీ పరిమితి రూ. 10 లక్షలు.
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షలు రోజువారీ పరిమితి రూ. 6 లక్షలు.
వ్యాపారి చెల్లింపులు ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షలు రోజువారీ పరిమితి లేదు
ఆభరణాల చెల్లింపు ప్రతి లావాదేవీకి రూ. 2 లక్షలు రోజువారీ పరిమితి రూ. 6 లక్షలు.
ఫారెక్స్ రిటైల్ (BBPS) ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షలు రోజువారీ పరిమితి రూ. 5 లక్షలు.
డిజిటల్ ఖాతా తెరవడం ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షలు రోజువారీ పరిమితి రూ. 5 లక్షలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి