
పెట్టుబడిదారులు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి గురించి కచ్చితంగా వినే ఉంటారు. ఈ పథకంలో పెట్టుబడి అనేది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పీపీఎఫ్‌కు అత్యంత ప్రజాదరణ ఉంటుంది. ఈ పథకంలో లభించే ప్రయోజనాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను బ్యాంకులు లేదా పోస్టాఫీసులే స్వయంగా వివరించినప్పటికీ సగటు పెట్టుబడిదారుడికి తరచుగా తెలియని అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా వడ్డీ లేదా పన్ను రహిత పెట్టుబడి లేదా మెచ్యూరిటీపై అందుకున్న మొత్తం సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియవు. పీపీఎఫ్ మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలుగా ఉంటుంది. కానీ, మీరు మీ పెట్టుబడిని 15 సంవత్సరాలకు మించి పొడిగిస్తే, మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. ఈ ఫార్ములా గురించి చాలా మందికి తెలియదు. పీపీఎఫ్‌లోపెట్టుబడితో పాటు ఇతర విషయాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
పీపీఎఫ్ పథకాన్ని 15 ఏళ్ల తర్వాత పొడగించే ముందు కచ్చితంగా మూడు పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మీరు 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత దానిలో డబ్బును పెట్టుబడి పెట్టకపోయినా మీరు మీ పెట్టుబడిపై వడ్డీని అందుకోవడం కొనసాగుతుంది. పీపీపీఎఫ్ ఖాతాలో మెచ్యూరిటీపై మొత్తం 3 ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా ఎంపికలను ఎంచుకోవడం ద్వారా, మీరు మీ డబ్బును మరింత పెంచుకోవచ్చు.
ప్రస్తుతం పీపీఎఫ్‌లో 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. మీరు ఈ వడ్డీ రేటుతో 15 లేదా 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మీరు నెలకు రూ.1000 పెట్టుబడిపై భారీ రాబడిని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి