Car Sale: బంపర్ ఆఫర్.! రూ. 13 లక్షల 7 సీటర్ SUV.. కేవలం రూ.4.16 లక్షలకే.. చూసేయ్యండి..

|

Feb 09, 2024 | 8:15 PM

కారు కొనాలని చూస్తున్నారా.? అది కూడా మీకు సరిపడా బడ్జెట్‌లోనే కావాలా.? అయితే టెన్షన్ పడకండి.. మీకోసం ఓ కారును ముందుకు తీసుకొచ్చేశాం. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో అందుబాటులో ఉన్న మహీంద్రా XUV500పై ఇంటర్నెట్‌లో మంచి డీల్ అందుబాటులో ఉంది. మరి అదేంటో చూసేద్దాం పదండి..

Car Sale: బంపర్ ఆఫర్.! రూ. 13 లక్షల 7 సీటర్ SUV.. కేవలం రూ.4.16 లక్షలకే.. చూసేయ్యండి..
Car
Follow us on

కారు కొనాలని చూస్తున్నారా.? అది కూడా మీకు సరిపడా బడ్జెట్‌లోనే కావాలా.? అయితే టెన్షన్ పడకండి.. మీకోసం ఓ కారును ముందుకు తీసుకొచ్చేశాం. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో అందుబాటులో ఉన్న మహీంద్రా XUV500పై ఇంటర్నెట్‌లో మంచి డీల్ అందుబాటులో ఉంది. మరి అదేంటో చూసేద్దాం పదండి..

కేవలం రూ.4.16 లక్షలకే ఈ మహీంద్రా XUV500ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ కారుది 2015 మోడల్, W6 వేరియంట్‌తో అమ్మకానికి ఉంది. ఇది 1వ హానర్ SUV. ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌తో వస్తోంది. ఎలక్ట్రిక్ మల్టీ ట్రిప్‌మీటర్, లెదర్ సీట్లు, లెదర్ స్టీరింగ్ వీల్, గ్లోవ్ కంపార్ట్‌మెంట్, టెంపరేచర్ డిస్‌ప్లే, డిజిటల్ క్లాక్, డిజిటల్ ఓడోమీటర్, ఫోల్డింగ్ టేబుల్, పవర్ విండో, డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, ఏసీ, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందుబాటులో ఉన్నాయి.

ఇక కారు కాల్యుకులేషన్స్ విషయానికొస్తే.. దీని పొడవు 4585 mm, వెడల్పు 1890 mm, ఎత్తు 1785 mm, గ్రౌండ్ క్లియరెన్స్‌కి 200 mm, వీల్‌బేస్ 2700 mmగా ఉంది. అలాగే ఈ 7-సీటర్ కారులో 2179 cc ఇంజిన్ అమర్చబడి ఉంది. ఇది 140bhp పవర్, 330Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. డీజిల్‌తో నడిచే ఈ ఎస్‌యూవీ.. లీటర్‌కు16 కిలోమీటర్ల మైలేజి అందిస్తోంది. 70 లీటర్ల వరకు డీజిల్‌ను స్టోర్ చేయగలిగే ట్యాంక్ ఈ SUVలో ఉంది. ఇది గంటకు 185 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. కాగా, మహీంద్రా XUV500 W6 వేరియంట్ ప్రస్తుత ధర రూ. 13.63 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే ఈ వేరియంట్‌ను మహీంద్రా సంస్థ ప్రస్తుతం ఆపేసింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో మాత్రమే ఈ వేరియంట్ దొరుకుతోంది.

కారు గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే.. ఈ ఇన్‌స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేయండి..

కాగా, సెకండ్ హ్యాండ్ కార్లు కొనేటప్పుడు సదరు వాహనానికి సంబంధించిన యజమానిని కలవకుండా, కారు కండీషన్ చెక్ చేయకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. ఈ విషయాన్ని కస్టమర్లు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.