Royal Enfield Scram 411: రాయల్ ఎన్ఫీల్డ్ వాహన ప్రియులకోసం(Bike lovers) కంపెనీ నేడు తన కొత్త మోడల్ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి రాయల్ ఎన్ఫీల్డ్ స్కామ్ 411గా నామకరణం చేసింది. కొత్తగా వచ్చిన ఈ బైక్ హిమాలయన్(Royal Enfield Himalayan) మోడల్ ఇంజిన్, ప్లాట్ ఫామ్ లో చాలా సిమిలారిటీలు కలిగి ఉంటాయని తెలిపింది. కానీ ఏడీవీ మోడల్ కు ఇది చాలా వ్యత్యాసం ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్ వాహనానికి 19 అంగుళాల వీల్స్ ఉంటాయని.. దానివల్ల రోడ్డు మీద ప్రయాణం మరింత సులువుగా ఉంటుందని చెప్పుకొచ్చింది.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడల్ బేస్ గా తీసుకుని రూపొందించిన స్కామ్ 411లో ఇంధన ట్యాంక్, సైడ్ ప్యానెస్స్, ఫెండర్లు ఉండనున్నాయి. ఒకే సీటుకు బదులుగా.. రెండు సీట్లు కలిగి ఉంటాయని తెలిపింది. వెనుకన ఉండే లగేజ్ ర్యాక్ ను తొలగించటంతో పాటు వెనుక ఉండే ఇండికేటర్ లైట్ల విషయంలో మార్పులు చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఈ బైక్ పవర్ ఫుల్ 411cc ఇంజిన్ కలిగిఉంది. సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 24PS పవర్ 32Nm టార్క్ తో వాహనదారులకు మంచి ప్రయాణ వేగాన్ని అనుభూతిని అందించనుంది. హిమాలయన్ మోడల్ తో పోల్చినపుడు దీని నుంచి చాలా ఫీచర్లను కంపెనీ తొలగించటం వల్ల తక్కువ ధరలో ఈ బైక్ లభించనుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 2.01 లక్షలుగా ఉండనుంది.
Stop/Go
Fast/Slow
Sprint/Flow
Ready for the switch?Live Launch stream starts
15th March 2022 | 2PM IST #ReadySet #RoyalEnfield #RidePure #PureMotorcycling https://t.co/VzBlmragIy— Royal Enfield (@royalenfield) March 14, 2022
ఇవీ చదవండి..
Corporate Bond Fund: బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తున్న ఆ మ్యూచువల్ ఫండ్స్..
Market News: స్పల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఊగిసలాటల్లో కొనసాగుతున్న సూచీలు..