Royal Enfield New Bike: మార్కెట్‌లోకి రాయల్ ఎన్ ఫీల్డ్ నయా మోడల్.. దీని ఫీచర్స్ అదుర్స్

| Edited By: Anil kumar poka

Dec 20, 2022 | 12:55 PM

యల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్ ను లాంచ్ చేయనుంది. క్లాసిక్ 350తో మార్కెట్ లో విడుదల చేయబోయే ఈ బైక్ బీఎస్ 6 ఇంజిన్ తో రానుంది. ఈ బైక్ మంచి అమెరికన్ క్లాసిక్ లుక్ కలిగి ఉంది. 

Royal Enfield New Bike: మార్కెట్‌లోకి రాయల్ ఎన్ ఫీల్డ్ నయా మోడల్.. దీని ఫీచర్స్ అదుర్స్
Royal Enfield
Follow us on

బైక్ లవర్స్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఆ బైక్ లుక్, ఇంజిన్ బీట్ వంటివి ఆకర్షిస్తుంటాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై ప్రయాణిస్తే వచ్చే రాయల్ ఫీలింగ్ వేరు. కాబట్టే అంతా ఆ బైక్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త మోడల్ ను లాంచ్ చేయనుంది. క్లాసిక్ 350తో మార్కెట్ లో విడుదల చేయబోయే ఈ బైక్ బీఎస్ 6 ఇంజిన్ తో రానుంది. ఈ బైక్ మంచి అమెరికన్ క్లాసిక్ లుక్ కలిగి ఉంది. 

రాయల్ ఎన్ ఫీల్డ్ లవర్స్ 350 సిరీస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు పదేళ్లు ఈ సిరీస్ బైక్స్ మార్కెట్ ను శాసించాయి. ప్రస్తుతం రిలీజ్ చేస్తున్న క్లాసిక్ 350 బీఎస్ 6 బైక్ దేశంలో అత్యుత్తమ క్రూయిజర్ బైక్స్ లో ఒకటిగా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. అలాగే డిజైన్ పరంగా భారతీయులు ఇష్టపడేలా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేలా డిజైన్ సెట్ చేశామని కంపెనీ చెబుతుంది. 170 మి.మి గ్రౌండ్ క్లియరెన్స్ తో వచ్చే ఈ బైక్ బరువు 190 కిలోలు. అలాగే ఈ బైక్ లో యూఎస్ బీ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ప్యాసింజర్ సపోర్ట్ సీట్ , కాంపాక్ట్ హెడ్ లైట్ యూనిట్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. 

ఈ బైక్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఇది 15 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దాదాపు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అలాగే పేరుకు తగినట్టుగానే 350 సీసీ ఇంజిన్ తో వస్తుంది. అలాగే ఈ ఇంజిన్ ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్. దాదాపు లీటర్ కు 41 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. అలాగే ఫ్రంట్, బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ సదుపాయం ఉంది. 

ఇవి కూడా చదవండి

రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ధర భారతీయ మార్కెట్ లో రూ.1.80 లక్షలుగా ఉండనుంది. ఇది దాదాపు 15 రంగుల్లో అందుబాటులో ఉండనుంది. హాల్సియోన్ బ్లాక్, హల్సియోన్ గ్రీన్, క్రోమ్ రెడ్, రెడ్డిట్ గ్రే, హాలికాన్ గ్రే, రెడ్డిచ్ రెడ్, సిగ్నల్స్ మార్ష్ గ్రే, హాల్సియాన్ గ్రే, హాలీకాన్ గ్రీన్, గన్‌మెటల్ గ్రే, డార్క్ స్టెల్త్ బ్లాక్, రెడ్‌డ్చ్ హాలీకాన్ బ్లాక్, సిగ్నల్స్ ఎడారి ఇసుక వంటి ఎన్నో రంగుల్లో కస్టమర్లను ఆకర్షిస్తుంది. 

ప్రస్తుతం ఈ బైక్ బుక్ చేసుకున్న 45 రోజుల్లో కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. అలాగే అన్ని బైక్స్ ఉన్నట్టే దీనికి సంవత్సరం వారంటీ ఉంది. అయితే దీనికి రెండేళ్ల ఎక్స్ టెండెడ్ వారంటీ లేదా 20000 కి.మి ఏది ముందు వస్తే అది. అలాగే ఇందులో ఉండే ఎల్ సీడీ స్క్రీన్ ద్వారా ఓడో మీటర్, ట్రిప్ మీటర్, క్లాక్ వంటి ఫీచర్లను పొందవచ్చు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి