పూణెలో సైబర్ మోసానికి సంబంధించిన కొత్త కేసు నమోదైంది. మోసగాళ్ల బారిన పడి 62 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రూ. 2.22 కోట్లు పోగొట్టుకున్నారు. అనేక నెలలపాటు సాగిన ఈ స్కామ్‌లో స్కామర్‌లు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ అధిక మెచ్యూరిటీ వస్తాయని మభ్య బహుళ పాలసీలను కొనుగోలు చేసేలా చేశారు. 2023 సంవత్సరం చివరి నుంచి ఈ స్కామ్ ద్వారా బాధితురాలిని మభ్య పెడుతూ సొమ్ము కొట్టేశారు. బాధితుడికి ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (ఐఆర్‌డీఏఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వంటి ప్రఖ్యాత ఏజెన్సీల నుండి ప్రభుత్వ అధికారులుగా నటిస్తున్న వ్యక్తుల నుంచి అనేక కాల్స్ వచ్చాయి. అధిక మెచ్యూరిటీ ప్రయోజనాలతో బాధితుడికి అనేక బీమా పాలసీలను ఆఫర్ చేయడంతో బాధితురాలు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపింది.
స్కామర్లు తమను నమ్మేందుకు తమకు వివిధ ప్రభుత్వ బిరుదులు ఉన్నాయని బాధితురాలిని మభ్యపెట్టారు. ముఖ్యంగా ఈ పాలసీలు ప్రత్యేకంగా రిటైర్డ్ ఉద్యోగుల కోసమేనంటూ చెప్పారు. కాల్స్‌లో మాట్లాడిన వ్యక్తులు చాలా ప్రొఫెషనల్‌గా మాట్లాడడంతో బాధితుడు వాటిని నమ్మాడు. కాలక్రమేణా, బాధితుడు వివిధ బీమా పాలసీలను కొనుగోలు చేశాడు. జీఎస్టీ, ఆదాయపు పన్ను, టీడీఎస్, లావాదేవీల రుసుములు, ధ్రువీకరణ ఛార్జీలు, ఎన్ఓసీ ఛార్జీలతో సహా వివిధ ఛార్జీలను చెల్లించమని కోరడంతో బాధితురాలు చెల్లించింది. స్కామర్లు 19 వేర్వేరు విధానాల ద్వారా డబ్బు పంపమని సూచించారు. పాలసీల కోసం డబ్బు పంపడానికి బాధితురాలు ప్రయత్నించిన ప్రతిసారీ స్కామర్‌లు ప్రాసెసింగ్ లేదా రికవరీ ఫీజుల నెపంతో అదనపు నిధులను బదిలీ చేయమని అడిగారు.
తర్వాత కొన్ని రోజులకు గత చెల్లింపులు మోసపూరిత ఖాతాలకు మళ్లాయని, క్లెయిమ్ చేసిన అధికారుల నుంచి కాల్స్ కూడా రావడం ప్రారంభించాయి. ఆ నిధులను రికవరీ చేసేందుకు, మరిన్ని చెల్లింపులు చేయాల్సిందిగా సూచించారు. అనంతరం స్కామర్లు బెదిరింపులకు దిగడంతో తన వద్ద ఉన్న పొదుపు సొమ్మునంతా స్కామర్లకు బదిలీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. బీమా, ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సైబర్ మోసాలు దేశంలో చాలా సాధారణం అవుతున్నాయని, ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి