AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Service Charges: రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జీ చెల్లిస్తున్నారా..? ఈ నెంబర్‌కు కాల్ చేస్తే తిరిగి మీ అకౌంట్లోకి డబ్బులు..

హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్ల నుంచి బలవంతంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ ఇది చట్ట విరుద్దం. ఇలాంటి యజమానులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీ దగ్గర ఏ రెస్టారెంట్ లేదా హోటల్ సర్వీస్ ఛార్జీ వసూలు చేసేందుకు ఫిర్యాదు చేయవచ్చు.

Service Charges: రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జీ చెల్లిస్తున్నారా..? ఈ నెంబర్‌కు కాల్ చేస్తే తిరిగి మీ అకౌంట్లోకి డబ్బులు..
Service Charge
Venkatrao Lella
|

Updated on: Jul 20, 2026 | 12:56 PM

Share

రెస్టారెంట్లు, హోటళ్లకు తరచుగా వెళ్తూ ఉంటారు. తిన్న తర్వాత వెయిటర్ బిల్లు తెచ్చి ఇస్తాడు. ఆ బిల్లులో మీరు సర్వీస్ ఛార్జీ అనే పదం చూసే ఉంటారు. రెస్టారెంట్ మీకు ఫుడ్ సర్వ్ చేసినందుకు సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా వసూలు చేయడం చట్టవిరుద్ధమని చాలామందికి తెలియదు. అవగాహన లేకపోవడంతో బిల్లు కట్టేసి సైలెంట్‌గా వచ్చేస్తుంటారు. సర్వీస్ ఛార్జీ కస్టమర్ తమ ఇష్టపూర్వకంగా చెల్లించాలి. అంతేకానీ కస్టమర్ ఆమోదం లేకుండా బలవంతంగా బిల్లులో చేర్చడం అనేది నిబంధనలకు విరుద్దం. ఒక్కొసారి ఈ విషయం తెలిసిన కస్టమర్లు.. బిల్లు నుంచి సర్వీస్ ఛార్జీని తీసివేయమని కోరినా రెస్టారెంట్ యజమానులు తీసివేయడం లేదు. వెయిటర్ టిప్ లేదా తమ రెస్టారెంట్ విధానం ఇదేనంటూ సాకుగా చూపి కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారు.

కేంద్రం కఠిన నిబంధనలు

అయితే సర్వీస్ ఛార్జీకి సంబంధించి రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ దుకాణాలకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు జారీ చేసింది. కస్టమర్ల నుంచి బలవంతంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లకు సర్వీస్ నచ్చి ఇష్టపూర్వకంగా ఇస్తేనే స్వీకరించాలని కోరింది. వినియోగదారుల నుంచి ప్రతిరోజూ దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్న 41 రెస్టారెంట్లపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల జరిమానా విధించింది. అంతేకాకుండా రెస్టారెంట్ మీ నుండి బలవంతంగా సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తే.. వసూలు చేసిన ప్రతి రూపాయిని తిరిగి కస్టమర్‌కు చెల్లించేలా ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది.

ఈ నెంబర్‌కు కాల్ చేయండి

ఆహారం లేదా రెస్టారెంట్ సర్వీస్ నచ్చితే వినియోగదారుడు సంతోషంగా సర్వీస్ ఛార్జ్‌ను చెల్లించవచ్చు. ఒకవేళ రెస్టారెంట్ ఫుడ్ బిల్లుకు సర్వీస్ ఛార్జీని జోడించడం చట్టవిరుద్దం. అలా చేస్తే కస్టమర్ 1915కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇక NCH యాప్ (నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్)ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా కూడా రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు తక్షణమే మీ ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తారు. ఇక ఇ-ఫైలింగ్ పోర్టల్ (www.edaakhil.nic.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇక సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA)కి com-ccpa@nic.in అనే ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇలా ఫిర్యాదు చేసేందుకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఫిర్యాదు చేస్తే యజమానిపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. మీరు చెల్లించిన ఛార్జీని తిరిగి పొందవచ్చు.

Follow Us