RBI: లోన్ తీసుకున్నవారికి ఝలకిచ్చిన ఆర్‌బీఐ.. రెపోరేటు మరో 35 బేసిస్‌ పాయింట్ల పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన MPC సమావేశం సమీక్షను ఈరోజు విడుదల చేసింది మరియు రెపో రేటును 0.35 శాతం పెంచింది. ఇది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.

RBI: లోన్ తీసుకున్నవారికి ఝలకిచ్చిన ఆర్‌బీఐ.. రెపోరేటు మరో 35 బేసిస్‌ పాయింట్ల పెంపు
Rupee
Follow us

|

Updated on: Dec 07, 2022 | 11:08 AM

ద్రవ్య విధానాన్ని ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మూడు రోజులుగా జరుగుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య సమీక్ష విధాన సమావేశం నేటితో ముగిసింది. సమావేశం అనంతరం కొత్త ఏడాదికి ముందే సామాన్యులకు షాక్ ఇస్తూ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. రెపో రేటు వడ్డీ రేటుపై ప్రభావం చూపుతుంది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్ 30న సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును 5.90 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉందని ద్రవ్య సమీక్ష విధానాన్ని ప్రకటిస్తూ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అన్నారు.

రెపో రేటును 0.35 శాతం పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్‌ దాస్‌ ఇవాళ ప్రకటించారు. ఆ తర్వాత రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. ఆర్ధిక నిపుణుల అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ రెపోరేట్లను మరో 35 బేసిస్‌ పాయింట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్‌ బ్యాంక్‌ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.9 శాతం)ను తదుపరి దశల్లో పెంచే విషయంలో దూకుడు ధోరణిని ప్రదర్శించవద్దని ఆర్‌బీఐకు పారిశ్రామిక వేదిక అసోచామ్‌ విజ్ఞప్తి చేసింది.

ప్రభావం ఎలా ఉంటుంది

రెపో రేటు పెరుగుదల బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీంతో రుణం తీసుకునే ఖర్చు పెరుగుతుంది. ఈ ప్రభావం మీరు తీసుకున్న లోన్ పై పడుతుంది. మీరు ప్రతి నెల చెల్లించే EMI పెరుగుతుంది. రెపో రేటు పెంపు కారణంగా బ్యాంకుల రుణాల రేట్లు పెరగడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు మంగళవారం 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఏం చెప్పారంటే..

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్‌ దాస్‌ మాట్లాడుతూ.. మరో సంవత్సరం ముగింపునకు వచ్చిందని, దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం రేటు పెరుగుతూనే ఉంన్నాయి. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా దేశంలో సరఫరా గొలుసు పరిస్థితి సవాళ్లను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం రేటు ఎగువ స్థాయిలోనే ఉండగా, బ్యాంక్ క్రెడిట్ వృద్ధి ప్రస్తుతం రెండంకెల కంటే ఎక్కువగా వస్తోందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌ దాస్‌.

ఆర్‌బీఐ 1.90 శాతం మేర రేట్లు పెంపు..

రిజర్వ్ బ్యాంక్ తన గత మూడు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో రెపో రేటును మొత్తం 1.90 శాతం పెంచింది. ఇందులో మేలో 40 బేసిస్ పాయింట్లు, జూన్, ఆగస్టులో 50-50 బేసిస్ పాయింట్లు పెంచారు. ప్రస్తుతం రెపో రేటు 5.90 శాతంగా ఉండగా, నేడు ఆర్‌బీఐ రెపో రేటును 0.35 శాతం పెంచింది. దీంతో రెపో రేటులో 6.25 శాతానికి చేరుకుంది.

రెపో రేటు అంటే ఏంటి?

రెపో రేటు అనేది ఆర్‌బిఐ ద్వారా ఏదైనా బ్యాంకు రుణం ఇచ్చే రేటు. దీని ఆధారంగానే బ్యాంకులు ఖాతాదారులకు రుణాలు ఇస్తాయి. ఇది కాకుండా, రివర్స్ రెపో రేటు అనేది బ్యాంకులకు వారి డిపాజిట్లపై వడ్డీని ఇచ్చే రేటు. RBI రెపో రేటును పెంచడం వలన, బ్యాంకులపై భారం పెరుగుతుంది. బ్యాంకులు వడ్డీ రేటును పెంచడం ద్వారా ఖాతాదారులకు భర్తీ చేస్తాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!