EMI Calculator: రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ.. వచ్చే నెల మీ EMI ఎంత పెరుగుతుందో తెలుసా..

ఐదోసారి రెపో రేటును పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా కొత్త గృహ రుణం మరింత భారంగా మారుతంది. ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వారికి EMI ఎంత పెరుగుతుందో తెలుసా..

EMI Calculator: రెపో రేటును పెంచిన ఆర్‌బీఐ.. వచ్చే నెల మీ EMI ఎంత పెరుగుతుందో తెలుసా..
Home Loan Emi Calculator
Follow us

|

Updated on: Dec 07, 2022 | 1:12 PM

రిజర్వ్ బ్యాంక్ మానిటరీ రివ్యూ పాలసీ (RBI మానిటరీ పాలసీ) ఫలితాలను ప్రకటించింది. ఆర్‌బీఐ ప్రకటన తర్వాత సామాన్య జనం పెద్ద షాక్‌కు గురయ్యారు. ఆర్బీఐ మరోసారి రెపో రేటు (రెపో రేట్స్ హైక్) వడ్డీ రేట్లను పెంచింది, అంటే ఇప్పుడు మీ ఈఎంఐ మళ్లీ పెరిగింది. కొత్త సంవత్సరం నుండి మీ EMI ఎంత పెరుగుతుందో మేము మీకు తెలియజేస్తాము. రెపో రేట్లు ఇప్పటి వరకు 5 సార్లు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను 35 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇంతకు ముందు కూడా ఆర్‌బీఐ రెపో రేట్లను 5 సార్లు పెంచింది. 8 నెలల్లో,  ఆర్బీఐ రెపో రేట్లను 4 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. అంటే, ఇప్పటివరకు మొత్తం 2.25 శాతం పెంచింది.

రూ. 25 లక్షల రుణం తీసుకుంటే..

ఉదాహరణకు – మీరు 20 సంవత్సరాల పాటు ఎస్‌బీఐ నుంచి రూ. 25 లక్షల గృహ రుణం తీసుకున్నట్లయితే.. మీరు 8.40 శాతం వడ్డీ రేటుతో రూ. 21,538 ఈఎంఐ చెల్లించాలి. ప్రస్తుతం, ఈరోజు రెపో రేట్లలో 35 బేసిస్ పాయింట్లు పెరిగిన తర్వాత.. మీ వడ్డీ రేటు 8.75 శాతానికి పెరుగుతుంది. మీ ఈఎంఐ కూడా రూ.21,538 నుంచి రూ.22,093కి పెరుగుతుంది. అంటే మీ ఈఎంఐ రూ. 555 పెరుగుతుంది. మీరు ఏటా రూ. 6660 ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

రూ.40 లక్షల రుణం తీసుకుంటే..

రూ.40 లక్షల రుణం తీసుకుంటే ఈఎంఐ రూ.10,656 పెరుగుతుంది. ఇదే కాకుండా మీరు రూ.40 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్లకు తీసుకున్నట్లయితే.. ఈరోజు నుంచి 8.75 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు, మీరు 8.40 శాతం చొప్పున రూ.34,460 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఈ రోజు నుంచి మీరు రూ. 35,348 ఈఎంఐ చెల్లించాలి.. అంటే మీ వార్షిక ఈఎంఐ రూ. 10,656 పెరుగుతుంది.

ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో..

ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ఇది మీ ఈఎంఐని కూడా ప్రభావితం చేస్తుంది. గృహ రుణాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లలో 0.35 శాతం పెరుగనున్నాయి. రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్‌పై వడ్డీ రేట్లు పెరుగుతాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్