RBI: ఆర్బీఐ మళ్లీ సామాన్యులకు షాకివ్వనుందా..? మరోసారి ఆ రేటు పెంచనుందా..?

|

Dec 04, 2022 | 8:14 PM

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అమెరికా ఫెడరల్ రిజర్వ్ తరహాలో చర్యలు తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా..

RBI: ఆర్బీఐ మళ్లీ సామాన్యులకు షాకివ్వనుందా..? మరోసారి ఆ రేటు పెంచనుందా..?
RBI
Follow us on

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అమెరికా ఫెడరల్ రిజర్వ్ తరహాలో చర్యలు తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సెంట్రల్ బ్యాంకులు రెపో రేట్లను నిరంతరం పెంచుతున్నాయి. అదే అనుసరించి డిసెంబర్ 7వ తేదీన రెపో రేటును పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించవచ్చు. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ఆర్‌బీఐ గతంలోనూ పలుమార్లు రెపో రేటును పెంచింది. మే నుండి ఇప్పటి వరకు వడ్డీ సుమారు 2 శాతం పెరిగింది.

0.35 శాతం వరకు పెరగనుంది

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం డిసెంబర్ 5 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఆర్‌బీఐ మరోసారి రెపో రేటును పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. ఇటీవలి రోజుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి రెపో రేటును 0.25 నుంచి 0.35 శాతం వరకు పెంచవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 7న ఆర్‌బీఐ సమావేశం ముగియనుందని, ఆ తర్వాత రెపో రేటు పెంపునకు సంబంధించి ప్రకటన వెలువడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈసారి కూడా ఎంపీసీ రేట్లను పెంచుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ తెలిపారు. అయితే ఈ పెరుగుదల 0.25 నుండి 0.35 శాతం వరకు ఉండవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు 6.5 శాతానికి చేరుకుంటుందని, అంటే ఫిబ్రవరిలో మరోసారి రెపో రేటు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ డీకే పంత్ తెలిపారు. అయితే ఈ త్రైమాసికంలో ఇది ఆరు శాతానికి పైనే ఉంటుంది. అందువల్ల డిసెంబర్ 2022లో ఆర్‌బిఐ ద్రవ్య విధానాన్ని 0.25 శాతం పెంచగలదని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి