HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి పెద్ద రిలీఫ్ కల్పించిన ఆర్బీఐ.. క్రెడిట్ కార్డుల జారీపై నిషేధం ఎత్తివేత..!

| Edited By: Ravi Kiran

Aug 18, 2021 | 9:05 AM

HDFC: రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ( RBI ) ప్రైవేట్‌ సెక్టార్‌లో అతిపెద్ద బ్యాంక్‌ అయిన HDFC కి పెద్ద ఉపశమనం కలిగించింది. క్రెడిట్‌ కార్డుల జారీపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రకటన జారీ చేసింది. HDFC బ్యాంక్

HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి పెద్ద రిలీఫ్ కల్పించిన ఆర్బీఐ.. క్రెడిట్ కార్డుల జారీపై నిషేధం ఎత్తివేత..!
Hdfc Bank
Follow us on

HDFC: రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ( RBI ) ప్రైవేట్‌ సెక్టార్‌లో అతిపెద్ద బ్యాంక్‌ అయిన HDFC కి పెద్ద ఉపశమనం కలిగించింది. క్రెడిట్‌ కార్డుల జారీపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రకటన జారీ చేసింది. HDFC బ్యాంక్ ప్రతినిధి దీనిని ధృవీకరించినట్లు తెలిపారు. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. గత రెండు సంవత్సరాలలో, డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, చెల్లింపులకు సంబంధించిన అనేక సమస్యలపై బ్యాంక్ సాంకేతిక లోపాల కారణంగా RBI నిషేధం విధించింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా, ఏదైనా కొత్త డిజిటల్ ఉత్పత్తిని ప్రారంభించకుండా బ్యాంకును నిరోధించింది.

అయితే భారతదేశంలో క్రెడిట్ కార్డుల జారీ విషయంలో HDFC బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. కానీ డిసెంబర్ 2020 నుంచి బ్యాంకుకు కొత్త క్రెడిట్ కార్డుల జారీపై నిషేధం కారణంగా దాని మార్కెట్ వాటా తగ్గింది. క్రెడిట్ కార్డ్ బకాయిలు నవంబర్ 2020 లో 15.4 మిలియన్ల నుంచి మే 2021 లో 14.9 మిలియన్లకు తగ్గాయి. ఏదేమైనా జూన్ చివరి వారంలో బ్యాంక్ భవిష్యత్తులో దానిని భర్తీ చేస్తామని పేర్కొంది. గత నెలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) శశిధర్ జగదీసన్ ఆర్‌బిఐ త్వరలోనే క్రెడిట్ కార్డుల జారీపై నిషేధం ఎత్తివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం.. వచ్చే రెండేళ్లలో వివిధ సాంకేతిక రంగాల్లో అనుభవం ఉన్న 500 మందిని రిక్రూట్ చేస్తామని బ్యాంక్ తెలిపింది. ఇందులో డేటా అనలిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజైన్, క్లౌడ్ మొదలైనవి ఉన్నాయి. భవిష్యత్తులో కొత్త డిజిటల్ ఉత్పత్తులు, సేవలను పరిచయం చేయడానికి IT (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ‘డిజిటల్ యూనిట్’, ‘ఎంటర్‌ప్రైజ్ యూనిట్’ ఏర్పాటు చేయబోతోంది. ఈ యూనిట్లు బ్యాంకును నడపడానికి కాలక్రమేణా మార్పులను తీసుకురావడానికి దోహదపడుతాయి.

Crime News: దారుణం.. మగ పిల్లాడి కోసం 8 సార్లు అబార్షన్.. 1500కు పైగా హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు..

Thadepalli Town: తాడేపల్లి పట్టణంలో రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Viral Photos: ఈ ఫొటోలు చూస్తే మనసు ఎటో వెళ్లిపోతుంది..! భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశాలు..