AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: రెపో రేట్లు యథాతథం..? మరి ఆ పథకాలపై వడ్డీ రేట్లు తెలిస్తే షాకవుతారు..

పీపీఎఫ్‌, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లు, సుకన్య సమృద్ధి యోజన సహా చాలా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం అలాగే ఉంచింది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు. 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు మాత్రమే 6.5 శాతం నుంచి 6.7 శాతానికి 20 బేసిస్ పాయింట్లు పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అక్టోబర్ 1, 2023 నుండి ప్రారంభమై డిసెంబర్ 31, 2023తో ముగిసే వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు సవరించారు.

FD Interest Rates: రెపో రేట్లు యథాతథం..? మరి ఆ పథకాలపై వడ్డీ రేట్లు తెలిస్తే షాకవుతారు..
Money
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 04, 2023 | 10:15 AM

Share

ఆర్‌బీఐ ఎంపీసీ వచ్చే వారం రెపో రేటును యథాతథంగా ఉంచుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పీపీఎఫ్‌, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లు, సుకన్య సమృద్ధి యోజన సహా చాలా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం అలాగే ఉంచింది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు. 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు మాత్రమే 6.5 శాతం నుంచి 6.7 శాతానికి 20 బేసిస్ పాయింట్లు పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అక్టోబర్ 1, 2023 నుండి ప్రారంభమై డిసెంబర్ 31, 2023తో ముగిసే వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు సవరించారు. ఈ తాజా పెంపు ఎంత మేర ఉంటాయో ఓ సారి తెలుసుకుందాం.

అక్టోబర్-డిసెంబర్ 2023 వరకూ చిన్న పొదుపు పథకాలపై తాజా వడ్డీ రేట్లు ఇలా

  • సేవింగ్స్ డిపాజిట్ 4 శాతం
  • 1-సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 6.9 శాతం
  • 2-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7.0 శాతం
  • 3-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7 శాతం
  • 5-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు 7.5 శాతం
  • 5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు 6.7 శాతం (ముందు 6.5 శాతం)
  • నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్‌ఎస్‌సీ) 7.7 శాతం
  • కిసాన్ వికాస్ పత్ర 7.5 శాతం (115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది)
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1 శాతం
  • సుకన్య సమృద్ధి ఖాతా 8.0 శాతం
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 8.2 శాతం
  • నెలవారీ ఆదాయ ఖాతా 7.4 శాతం.
  • ముఖ్యంగా ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు 4 శాతం (పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్లు), 8.2 శాతం (సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్) మధ్య ఉంటాయి.

బ్యాంక్ ఎఫ్‌డీలపై తాజా వడ్డీ రేట్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటా 7.60 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. పీఎన్‌బీ సంవత్సరానికి 7.75 శాతం వరకు ఇస్తోంది. ఎస్‌బీఐ ఏటా 7.50 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది.

భారతదేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటు

ఆగస్టులో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ ఎగువ సహన పరిమితిని దాటి 6.83 శాతం వద్ద ఉంది. అయితే జూలైలో గరిష్ట స్థాయి 7.44 శాతం కంటే గణనీయంగా తక్కువగా ఉంది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం వల్ల ఇది ఎక్కువగా జరిగింది.

ఇవి కూడా చదవండి

వడ్డీ సవరణ ఇలా

చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికం చివరిలో సమీక్షిస్తారు. తదనుగుణంగా తదుపరి త్రైమాసికానికి నిర్ణయిస్తారు. వడ్డీ రేటు సమీక్ష మునుపటి త్రైమాసికంలో (తాజా సందర్భంలో జూలై-సెప్టెంబర్ 2023) జీ-సెక్‌ రాబడుల ఆధారంగా చేస్తారు. జూన్ 30, 2023న జరిగిన మునుపటి సమీక్షలో ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. 1-సంవత్సరం, 2-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి కొన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచింది.  సెప్టెంబర్ 2022  ఇప్పటివరకూ నాలుగుసార్లు వడ్డీ రేట్లను సవరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి