Digital Rupee: నేటి నుంచి అమలులోకి రానున్న డిజిటల్ రూపాయి.. ఏయే నగరాల్లో అందుబాటులోకి వస్తుందంటే..?

|

Dec 01, 2022 | 7:08 AM

ఈ ఏడాది నవంబర్ 1న హోల్‌సేల్ సెగ్మెంట్ కోసం ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపాయిని ప్రారంభించిన ఆర్‌బీఐ, ఈరోజు(డిసెంబర్ 1) నుంచి రిటైల్ ఉపయోగం కోసం డిజిటల్ రూపాయి(ఈ-రూపాయి)ని విడుదల చేయనుంది. దేశంలోని..

Digital Rupee: నేటి నుంచి అమలులోకి రానున్న డిజిటల్ రూపాయి.. ఏయే నగరాల్లో అందుబాటులోకి వస్తుందంటే..?
Digital Rupee
Follow us on

ఈ ఏడాది నవంబర్ 1న హోల్‌సేల్ సెగ్మెంట్ కోసం ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపాయిని ప్రారంభించిన ఆర్‌బీఐ, ఈరోజు(డిసెంబర్ 1) నుంచి రిటైల్ ఉపయోగం కోసం డిజిటల్ రూపాయి(ఈ-రూపాయి)ని విడుదల చేయనుంది. దేశంలోని బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, భువనేశ్వర్‌ వంటి నగరాలలో డిజిటల్ రూపాయి ఆచరణాత్మకంగా ఉనికిలోకి రాబోతుంది. రిటైల్ డిజిటల్ రూపాయి వ్యాపారంలో తొలుత ఎస్‌బీఐ , ఐసీఐసీఐ బ్యాంక్‌లతో సహా మొత్తం నాలుగు బ్యాంకులు పాల్గొంటాయని ఆర్‌బీఐ తెలిపింది. డిజిటల్ రూపాయి ప్రారంభదశలో బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, భువనేశ్వర్‌లలోని నిర్దిష్ట వినియోగదారులు, వ్యవస్థాపకుల సమూహంలో మాత్రమే పంపిణీలోకి రానుంది.

డిజిటల్ రూపాయి డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. డిజిటల్ రూపాయి కూడా ప్రస్తుత కరెన్సీ నోట్లు, నాణేల విలువతోనే అమలులోకి వస్తుంది. UPI సిస్టమ్‌కు UPI ID లేదా QR కోడ్ ఉన్నట్లే, డిజిటల్ రూపాయికి డిజిటల్ రూపాయి వాలెట్ సిస్టమ్ ఉంటుందని, యూజర్లు మొబైల్ ఫోన్లలో ఈ డిజిటల్ రూపాయిని స్టోర్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. డిజిటల్ వాలెట్ ద్వారా ఈ-రూపాయి లావాదేవీలు జరుగుతాయని, మరింత సురక్షితంగా జరుగుతాయని ఆర్బీఐ తెలిపింది. బ్యాంక్ నుండి కరెన్సీని కొనుగోలు చేసిన తర్వాత, అది వాలెట్ నుంచి మరో వాలెట్‌కు బదిలీ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి


10, 100, 200, 500 రూపాయల విలువతో డిజిటల్ రూపాయిఅందుబాటులో ఉంటుంది. 50 పైసలు, 1 రూ. విలువతో కూడా డిజిటల్ రూపాయి అందుబాటులోకి వస్తుందని వారు చెబుతున్నారు. కాగా, నవంబర్ 1న ఆర్‌బీఐ టోకు విభాగం ఈ-రూపాయిని ప్రారంభించింది. ఈ రకమైన డిజిటల్ రూపాయి ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, HSBC బ్యాంక్‌లలో చెలామణిలో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..