RBI: మరోసారి షాకిచ్చిన రిజర్వ్‌ బ్యాంకు.. రెపోరేటు పెంచుతూ నిర్ణయం.. పెరగనున్న ఈఎంఐ

|

Feb 08, 2023 | 11:10 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల పాటు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరుగుతోంది. బుధవారం మూడో రోజు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రెపోరేటు పెంచుతున్నట్లు..

RBI: మరోసారి షాకిచ్చిన రిజర్వ్‌ బ్యాంకు.. రెపోరేటు పెంచుతూ నిర్ణయం.. పెరగనున్న ఈఎంఐ
RBI
Follow us on

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల పాటు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరుగుతోంది. బుధవారం మూడో రోజు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రెపోరేటు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 25 వేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. 6.25 నుంచి 6.50 శాతానికి రెపోరేటును పెంచింది. 2023 ఏప్రిల్‌-జూన్‌ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా అంచనా. ఈ రెపోరేటు పెరగడం వల్ల బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి.

రెపో రేటు అంటే ఏమిటి?

ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రేపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేపో రేటును నిర్ణయిస్తారు. రెపో రేటున‌ను తగ్గిస్తే బ్యాంకులకు త‌క్కువ‌కే రుణాలు వ‌స్తాయి. ఈ ప్ర‌భావంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది.

రివర్స్ రేపో రేటు అంటే ఏమిటి?

బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వవచ్చు. అలా బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రేపో రేటు అంటారు. ఇది రెపో రేటు క‌న్నా తక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి