NPA: బ్యాంకులకు తగ్గిన మొండి బకాయిల సమస్య.. పెరిగిన క్రెడిట్ కార్డ్ అప్పులు: ఆర్బీఐ నివేదిక
భారతీయ బ్యాంకుల ఎన్‌పీఏ క్షీణత కొనసాగుతోంది . మార్చి 2023 లో మొత్తం నాన్-పెర్ఫార్మింగ్ లోన్‌లు తగ్గాయి. భారతీయ బ్యాంకుల్లో ఈ మొండి బకాయిలు శాతం 3.9గా ఉంది. జూన్ 28 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ..
భారతీయ బ్యాంకుల ఎన్‌పీఏ క్షీణత కొనసాగుతోంది . మార్చి 2023 లో మొత్తం నాన్-పెర్ఫార్మింగ్ లోన్‌లు తగ్గాయి. భారతీయ బ్యాంకుల్లో ఈ మొండి బకాయిలు శాతం 3.9గా ఉంది. జూన్ 28 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఈ అంశం హైలైట్ చేయబడింది. గత 10 ఏళ్లలో ఇదే అత్యల్ప మొండి బకాయిల నిష్పత్తిగా పేర్కొంది. అంతేకాకుండా నికర మొండి బకాయిల మొత్తం కూడా 1 శాతంగా ఉంది. ఇప్పుడు భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నిర్దేశించిన కనీస మూలధన స్థాయి అవసరాన్ని సులభంగా తీర్చగలవు. తాజా మూలధనాల లేకుండా ఒక సంవత్సరం పాటు ఎన్‌పీఏల ఒత్తిడిని తట్టుకునేంత శక్తి బ్యాంకులు ఉన్నాయని ఆర్‌బీఐ నివేదిక చెబుతోంది.
క్రెడిట్ కార్డ్ అప్పుల తలనొప్పి
ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ విభాగాల్లో మొండి బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం.. మార్చి 2023 నెలలో ప్రభుత్వ బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌ల మొండి బకాయిల మొత్తం 18 శాతం ఉంది. గత ఏడాది మార్చి నెలలో ఇది 9 శాతం మాత్రమే ఉంది. అంటే ఈ ఎన్‌పీపీఏ దాదాపు రెట్టింపు అయ్యింది. ప్రభుత్వ బ్యాంకుల్లో పర్సనల్ లోన్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ రుణాలు బ్యాంకులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ఈ ప్రభుత్వ బ్యాంకులకు ఇప్పుడు క్రెడిట్ కార్డు రుణాలు తలనొప్పిగా మారాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి