AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahila Samman Scheme: ఇక నుంచి బ్యాంకుల్లోనూ ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌’

ఈ సంవత్సరం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ (MSSC) 2023 పథకాన్ని ఇప్పుడు వివిధ బ్యాంకుల నుండి పొందవచ్చు. ఫిబ్రవరి బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఈ పొదుపు పథకాన్ని ప్రకటించారు..

Mahila Samman Scheme: ఇక నుంచి బ్యాంకుల్లోనూ 'మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌'
Mahila Samman Scheme
Subhash Goud
|

Updated on: Jun 29, 2023 | 7:36 PM

Share

ఈ సంవత్సరం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ (MSSC) 2023 పథకాన్ని ఇప్పుడు వివిధ బ్యాంకుల నుండి పొందవచ్చు. ఫిబ్రవరి బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఈ పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది పోస్టాఫీసుల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మీరు 16 బ్యాంకుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పొందవచ్చు. 4 ప్రైవేట్ బ్యాంకులు, 12 ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు ఉన్నాయి. ఆర్థిక శాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ పత్ర యోజన అన్ని ప్రభుత్వ బ్యాంకులు, 4 ప్రైవేట్ బ్యాంకులలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే చాలా మంది మహిళలు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేందుకు ప్రోత్సహించేందుకు మోడీ సర్కార్‌ 2023 బడ్జెట్‌ సమావేశాల్లో వన్‌టైమ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ అయిన ‘మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌’ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో వారి కోసం లేదా మైనర్‌ల కోసం అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐసిఐసిఐ బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకులు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌ను అందించడానికి అధికారం కలిగి ఉన్నాయని అని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌ 2023ని అందిస్తున్న బ్యాంకులు:

  • ICICI బ్యాంక్
  • యాక్సిస్ బ్యాంక్
  • HDFC బ్యాంక్
  • IDBI బ్యాంక్
  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)
  • బ్యాంక్ ఆఫ్ బరోడా
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
  • కెనరా బ్యాంక్
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ఇండియన్ బ్యాంక్
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్
  • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • UCO బ్యాంక్

    మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కోసం షరతులు:

  • మహిళా సమ్మాన్ నిధి యోజనతో సహా వివిధ జాతీయ పొదుపు పథకాల పనితీరు కోసం బ్యాంకులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండాలి.
  • స్కీమ్‌లలో జమ చేసిన డబ్బును 1 నుంచి 3 రోజులలోపు ఆర్బీఐలోని ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయాలి.
  • జాతీయ పొదుపు పథకాలు అందుబాటులో లేని శాఖల జాబితాను బ్యాంకులు ముందుగానే తెలియజేయాలి.
  • పొదుపు పథకంలో వచ్చే డబ్బును బదిలీ చేయడంలో బ్యాంకులు ఆలస్యం చేస్తే, వడ్డీ, డిపాజిట్ శాతం 0.5 % మొత్తాన్ని డిపాజిట్ చేసిన వ్యక్తికి పెనాల్టీగా చెల్లించాలి. 30 రోజుల కంటే ఎక్కువ ఆలస్యం అయితే శాతం 1 శాతం బ్యాంకులు పెనాల్టీగా చెల్లించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు