RBI: జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!

Zero Balance Account: ఈ మార్పులను అమలు చేయడం ఉద్దేశ్యం BSBD ఖాతాలకు ప్రాముఖ్యతను పెంచడం, వాటి ప్రయోజనాలను అర్థం చేసుకోవడం. ఈ కొత్త నియమాలు స్థానిక ప్రాంత బ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు..

RBI: జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్‌బీఐ శుభవార్త.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!

Updated on: Dec 06, 2025 | 9:49 PM

Zero Balance Account: సాధారణ కస్టమర్లకు ఉపశమనం కలిగించేలా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలో రిజర్వ్ బ్యాంక్ (RBI) గణనీయమైన మార్పులు చేసింది. ఈ మార్పులలో అపరిమిత నెలవారీ డిపాజిట్లు, ఎటువంటి పునరుద్ధరణ రుసుము లేకుండా ఉచిత ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ వినియోగం, సంవత్సరానికి కనీసం 25 పేజీల ఉచిత చెక్‌బుక్, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, పాస్‌బుక్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్ ఉన్నాయి. ఈ బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు డిపాజిట్‌ మార్పులను అమలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు ఏడు రోజుల సమయం ఇచ్చింది.

ఇప్పుడు ఉచిత ఉపసంహరణకు పరిమితి ఎంత ఉంటుంది?

బ్యాంకులు నెలకు కనీసం నాలుగు ఉచిత ఉపసంహరణలను అనుమతించాల్సి ఉంటుంది. వాటిలో వారి హోమ్‌ బ్రాంచ్‌ ఏటీఎంలు, ఇతర బ్యాంకుల లావాదేవీలు కూడా ఉంటాయి. ఈ కొత్త నియమం ప్రకారం.. UPI, IMPS, NEFT, RTGS వంటి డిజిటల్ చెల్లింపు లావాదేవీలు ఉపసంహరణలుగా పరిగణించరు. అంటే ఈ డిజిటల్ లావాదేవీలకు వినియోగదారులకు విడిగా ఛార్జీ విధించరు.
ఇప్పటికే BSBD ఖాతాదారులు కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ల కోసం అభ్యర్థించవచ్చు. అయితే సాధారణ పొదుపు ఖాతాదారులు తమ ఖాతాను BSBD ఖాతాగా మార్చుకోవచ్చు. వారికి ఇప్పటికే మరే ఇతర బ్యాంకులో ఖాతా లేకపోతే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: High Court: భార్య అలా చేయడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు!

ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులు వారి అభీష్టానుసారం వాటిని ముందుగానే స్వీకరించవచ్చు. ఆర్బీఐ తన బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తనా మార్గాలు, కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది బ్యాంకులు అందించే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాల ఫ్రేమ్‌వర్క్‌ను అధికారికంగా మారుస్తుంది. నెలకు కనీసం నాలుగు సార్లు డబ్బు విత్‌డ్రా చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు.

ఇది కూడా చదవండి: Business Idea: ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం

కార్డ్ స్వైప్ (PoS), NEFT, RTGS, UPI, IMPS వంటి డిజిటల్ చెల్లింపులు నాలుగు సమయ పరిమితిలో లెక్కించరు. అంటే స్వైప్‌ చేసినా ఇతర లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు విధించరు. మీరు సంవత్సరానికి కనీసం 25 పేజీల చెక్ బుక్ సౌకర్యం, ఉచిత ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఉచిత పాస్‌బుక్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్ కూడా పొందుతారు. ఏటీఎం, డెబిట్ కార్డులు ఎటువంటి వార్షిక రుసుము లేకుండా అందిస్తాయి బ్యాంకులు.

మార్పు ఉద్దేశ్యం ఏమిటి?

ఈ మార్పులను అమలు చేయడం ఉద్దేశ్యం BSBD ఖాతాలకు ప్రాముఖ్యతను పెంచడం, వాటి ప్రయోజనాలను అర్థం చేసుకోవడం. ఈ కొత్త నియమాలు స్థానిక ప్రాంత బ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి.

ఇది కూడా చదవండి: PAN Card: బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. అప్పుడేం చేయాలి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి