
RBI: నిబంధనలు పాటించనందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులపై చర్యలు చేపడుతుంటుంది. ఆర్బీఐ బ్యాంకులపై చర్యలు చేపట్టిన జాబితాలో ఏపీ నుంచి రెండు బ్యాంకులు ఉన్నాయి. మానీటరీ నిబంధనలు ఉల్లంఘించడంతో జరిమానా విధించినట్లు నవంబర్ 20న అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది ఆర్బీఐ. రుణాల మంజూరు, నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనలు సరిగా పాటించకపోవడం వంటివి గుర్తించిన ఆర్బీఐ చర్యలు చేపట్టింది. మరి ఏపీలోని రెండు బ్యాంకులు సహా ఇతర బ్యాంకులు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించాయో చూద్దాం.
ఆర్బీఐ భారత్‌లో మొత్తం మూడు డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు (DCCB), ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుపై రెగ్యులేటరీ రూల్స్ ఉల్లంఘించడంతో ఈ జరిమానాలు వేసింది. ఈ మేరకు నవంబర్ 20, 2025 రోజున ఒక్కో బ్యాంకుకు ప్రత్యేక ఆర్డర్స్ జారీ చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫతేపుర్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో నో యువర్ కస్టమర్ (కేవైసీ) మార్గదర్శకాలను పాటించడం లేదని ఆర్‌బీఐ రూ.2 లక్షల జరిమానా విధించింది. అలాగే కర్ణాటకలోని తుముకూరులో ఉన్న తుముకూర్ గ్రెయిన్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించినందున రూ.1 లక్ష పెనాల్టీ వేసినట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Indian Railways: భారత రైల్వే కీలక నిర్ణయం.. ఇక 200 కి.మీ వేగంతో పరుగెత్తనున్న ఆ రైళ్లు!
ఏపీ నుంచి రెండు బ్యాంకులు:
ఇక ఏపీలో రెండు బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా విధించింది. కాకినాడ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్‌పై రూ.1 లక్ష, కర్నూలు జిల్లాలోని కర్నూలు డిస్ట్రిక్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్‌పై రూ.1.50 లక్షలు జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని సెక్షన్ 56, సెక్షన్ 20 నిబంధనలు పాటించడంలో విఫలమైనట్లు గుర్తించింది ఆర్బీఐ.
ఖాతాదారుల పరిస్థితి ఏంటి?
రిజర్వ్ బ్యాంక్ ఆ బ్యాంకులపై తీసుకున్న చర్యల వల్ల ఖాతదారులపై ఎలాంటి ప్రభావం పడదని ఆర్బీఐ తెలిపింది. ఖాతాదారుల మధ్య లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని, యథాతథంగా అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలు జరుగుతాయని స్పష్టత ఇచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి