AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆర్బీఐ ఈ బ్యాంకు పేరు మార్చింది.. మీ చెక్, పాస్‌బుక్‌లను మార్చాలా?

RBI: కస్టమర్ల మనస్సులో ఉన్న అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే వారి పాత చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఇప్పుడు చెల్లుతాయా? లేదాణ అని. పాత చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఇప్పటికీ చెల్లుబాటులో ఉంటాయని బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే కస్టమర్ల ప్రస్తుత బ్యాంకింగ్ పత్రాలు..

RBI: ఆర్బీఐ ఈ బ్యాంకు పేరు మార్చింది.. మీ చెక్, పాస్‌బుక్‌లను మార్చాలా?
Subhash Goud
|

Updated on: May 24, 2025 | 7:36 PM

Share

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (NESFB) ఇటీవల తన పేరును ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్‌గా మార్చుకుంది. దీనితో పాటు, బ్యాంకు రిజిస్టర్డ్ కార్యాలయం కూడా ఇప్పుడు అస్సాంలోని గౌహతి నుండి కర్ణాటకలోని బెంగళూరుకు మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం పొందిన తర్వాత ఈ మార్పు అమలు చేసింది.

బ్యాంక్ కొత్త పేరు ఇప్పుడు ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్. అలాగే దాని రిజిస్టర్డ్ కార్యాలయం బెంగళూరులో ఉంటుంది. దేశవ్యాప్తంగా తన పరిధిని, సేవలను మరింత బలోపేతం చేసుకునేందుకు బ్యాంక్ వ్యూహంలో ఈ మార్పు భాగం. అయితే, కస్టమర్లకు అందించే సేవలలో ఎటువంటి తగ్గింపు ఉండదని బ్యాంక్ హామీ ఇచ్చింది. ఈశాన్య భారతదేశంలోని దాని శాఖలు మునుపటిలా పనిచేస్తూనే ఉంటాయి.

పాత చెక్ బుక్, పాస్ బుక్ ఏమవుతుంది?

కస్టమర్ల మనస్సులో ఉన్న అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే వారి పాత చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఇప్పుడు చెల్లుతాయా? లేదాణ అని. పాత చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు ఇప్పటికీ చెల్లుబాటులో ఉంటాయని బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే కస్టమర్ల ప్రస్తుత బ్యాంకింగ్ పత్రాలు, సేవలు ప్రభావితం కావచ్చు. కొత్త పేరు, చిరునామాతో చెక్ పుస్తకాలు, పాస్‌బుక్‌ల కోసం క్రమంగా దరఖాస్తు చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది. కొత్త పత్రాల కోసం కస్టమర్లు తమ సమీప శాఖను సంప్రదించాలని కూడా బ్యాంక్ తెలిపింది. దీనికి ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని బ్యాంకు తెలిపింది.

కస్టమర్లకు సలహా..

కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలు, KYC, ఇతర సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలని బ్యాంక్ అభ్యర్థించింది. ఒక కస్టమర్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉపయోగిస్తే, అతను ఆన్‌లైన్ పోర్టల్‌లో కొత్త పేరు, చిరునామాతో అప్‌డేట్‌ చేసిన సమాచారాన్ని పొందుతారు. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే కొత్త పత్రాలను సకాలంలో పొందాలని బ్యాంక్ తెలిపింది.

పేరు ఎందుకు మార్చారు?

పేరు, చిరునామాను మార్చాలనే నిర్ణయం బ్యాంకు తన బ్రాండ్‌ను విస్తరించడానికి, బలోపేతం చేయడానికి తీసుకున్న వ్యూహంలో భాగం. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తన సేవలను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ బ్యాంకింగ్, ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకుంది.

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇకపై ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా పిలువబడుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అసౌకర్యాన్ని నివారించడానికి కొత్త పత్రాలను పొందడానికి కస్టమర్లు తమ శాఖను సంప్రదించాలని సూచించారు. కస్టమర్ల సౌలభ్యం, మరియు మెరుగైన సేవల కోసం ఈ మార్పు చేసినట్లు బ్యాంక్ హామీ ఇచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి