AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకు లైసెన్స్‌ రద్దు.. మరి ఖాతాదారుల పరిస్థితి ఏమిటి..?

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఇఫ్‌ ఇండియా (RBI) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకుల లైసెన్స్‌లు రద్దు చేయడం,..

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకు లైసెన్స్‌ రద్దు.. మరి ఖాతాదారుల పరిస్థితి ఏమిటి..?
Subhash Goud
|

Updated on: Feb 04, 2022 | 6:37 AM

Share

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఇఫ్‌ ఇండియా (RBI) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు పాటించని బ్యాంకుల లైసెన్స్‌లు రద్దు చేయడం, భారీ జరిమానా విధించడం, ఇతర ఆంక్షలు విధిస్తూ చర్యలు చేపడుతోంది. ఇక తాజాగా మరో బ్యాంకు (Bank)కు భారీ షాకిచ్చింది ఆర్బీఐ. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెన్స్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేసింది. నిబంధనలు పాటించనందున బ్యాంకింగ్‌ కార్యకలాపాలను సీజ్‌ చేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఇవి ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ ఒక ప్రకనటనలో తెలిపింది.

బ్యాంకు ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని గత సంవత్సరం కొన్ని ఆంక్షలు విధించామని తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరు నెఎలల వకకు వినియోగదారులు విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే గత ఏడాది ఆంక్షలు విధించినా బ్యాంకు ఆర్థిక పరిస్థితులు మెరుగు పడకపోవడంతో లైసెన్స్‌ రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు వద్ద సరిపోయే మూలధనం లేదని, రానున్న రోజుల్లో ఆదాయాలు వచ్ఏచ అవకాశాలు కూడా లేవని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్ల, డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.

కాగా, నిబంధనల కింద కస్టమర్ల డిపాజిట్లను వెనక్కి ఇచ్చే చర్యలను చేపట్టాలని బ్యాంకుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. రూ.5 లక్షల వరకు ఉన్న డిపాజిట్లను కస్టమర్లకు వెనక్కి ఇచ్చేయాలని, బ్యాంకు డేటా ప్రకారం.. రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ డిపాజిట్‌ చేసిన 99 శాతం ఖాతాదారులకు పూర్తి డబ్బులు వెనక్కి వస్తాయని ఆర్బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Gold, Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. దిగి వచ్చిన వెండి..!

Budget 2022: కేంద్రం గుడ్‌న్యూస్‌.. రూ.10 లక్షల వరకు ఉన్న ఆదాయానికి పన్ను ఉండదు.. ఎవరికో తెలుసా..?

Follow Us
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. రైల్వే జోన్ వచ్చేసిందోచ్..!
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్..
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..