AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే కార్డు రద్దు..!

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. ఆరు నెలలుగా రేషన్ తీసుకోనివారి కార్డులను నిలిపివేయనుంది. అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ మొదలపెట్టనుంది. దీని వల్ల లబ్దిదారులు రేషన్ తీసుకోరు. ఇతర ప్రయోజనాలు కూడా పూర్తిగా నిలిచిపోతాయి. మీ రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే..

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే కార్డు రద్దు..!
Ration Card
Venkatrao Lella
|

Updated on: Oct 03, 2026 | 3:17 PM

Share

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే యోచనలో ఉంది. కొంతమందికి కార్డు ఉన్నా సరే రేషన్ తీసుకోవడం లేదు. దీంతో అలాంటివారి కార్డులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఆరు నెలలుగా వరుసగా రేషన్ తీసుకోనివారి కార్డులను ఇనాక్టివ్ చేయనుంది. అంటే వారి కార్డు తాత్కాలికంగా పనిచేయవన్నమాట. కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తే మళ్లీ యాక్టివేట్ అవుతుంది. కొంతమంది రేషన్ తీసుకోకపోవడం వల్ల వారి కోటాకు సంబంధించిన బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ డీలర్లు వాటిని మార్కెట్ ధరకు విక్రయించుకుంటున్నారు. దీని వల్ల రేషన్ సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయి. దీనిని నివారించేందుకు రేషన్ తీసుకోనివారి కార్డులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కేంద్రం భావిస్తోంది.

అక్టోబర్ నుంచే బంద్..

దాదాపు 1.58 కోట్ల మంది రేషన్ కార్డులను అక్టోబర్ నుంచే నిలిపివేయనుందని తెలుస్తోంది. అయితే వీరి పేర్లను వెంటనే డేటా నుంచి తొలగించరు. మూడు నెలల పాటు గడువు ఇవ్వనున్నారు. ఈ మూడు నెలల్లో ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కార్డు యాక్టివేట్ చేస్తారు. మరణించిన వ్యక్తులు, డూప్లికేట్, నకిలీ వ్యక్తుల పేర్లతో ఉన్న కార్డులను గుర్తించి తొలగించే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. దీని వల్ల రేషన్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలు నిలిచిపోతాయని, అర్హులైన లబ్దిదారులు మాత్రమే ప్రయోజనం పొందుతారని కేంద్రం భావిస్తోంది. ఈకేవైసీ విధానం ద్వారా రేషన్ కార్డుల డేటా ప్రక్షాళన చేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది. దీంతో అర్హులైన లబ్దిదారులు రేషన్ కోల్పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడం వల్ల మీ రేషన్ కార్డు సురక్షితంగా ఉంటుంది. మీ రేషన్ కార్డును రద్దు చేసే అవకాశం ఉండదు. మీరు రేషన్ తీసుకోకుండా, కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుండా ఉంటే రేషన్ కార్డును తొలగించే అవకాశం ఉంటుంది.

రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?

కేంద్ర ప్రభుత్వం మేరా రేషన్ అనే యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మీరు సులువుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా మీ ముఖం స్కాన్ చేస్తే సరిపోతుంది. మొబైల్ నుంచే మీరు సులువగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సమీపంలోని మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లకు వెళ్లి అయినా కేవైసీ సులువుగా పూర్తి చేయవచ్చు. ఎవరైనా కేవైేసీ పూర్తి చేయకపోతే వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.

Follow Us