ఫస్ట్ జాబ్‌కే రూ.15,000.. కొత్త ఉద్యోగులకు బంపర్ బెనిఫిట్!
ఈపీఎఫ్‌ఓ పరిధిలోని సంస్థల్లో మొదటిసారి ఉద్యోగంలో చేరే భారతీయ యువతకు కేంద్ర ప్రభుత్వం రూ.15,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇది ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి జీతం తక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక మద్దతు అందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం. అర్హతలు, లబ్ధి పొందే విధానం తెలుసుకోండి.
భారతదేశంలో మొదటిసారి ఉద్యోగంలో చేరే యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలోకి వచ్చే కంపెనీలలో మొదటిసారి చేరే ఉద్యోగులకు రూ.15,000 నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద ఈ ఆర్థిక ప్రయోజనం ఇవ్వబడుతుంది. నిరుద్యోగాన్ని తగ్గించడం, కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ప్రారంభంలోనే ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. మొదటిసారి ఉద్యోగంలో చేరినప్పుడు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ ప్రోత్సాహకాన్ని పొందడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. అవేంటంటే, మీరు మొదటిసారి ఉద్యోగం పొందిన వారై ఉండాలి. ఈపీఎఫ్‌ఓ సిస్టమ్‌లో మీ పేరు ఇంతకుముందు నమోదై ఉండకూడదు. మీ నెలవారీ గ్రాస్ వేతనం లక్ష రూపాయలకు మించకూడదు. మీరు చేరే కంపెనీ తప్పనిసరిగా ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి వచ్చే ఆర్గనైజ్డ్ సెక్టార్ కంపెనీ అయి ఉండాలి. ఈ సొమ్ము మూడు విడతల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. దీని కోసం మీ యూఏఎన్, ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీరు వృథా చేస్తే భారీగా ఫైన్.. కరెంట్, వాటర్ కష్టాలకు చెక్ పెట్టేదెలా?
ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి ఖాతాల్లోకి రూ.6,000 జమ!
టీటీడీ కీలక నిర్ణయం! తిరుమలలో ఏఐ టెక్నాలజీతో ఉద్యానవనాల అభివృద్ధి
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్ నుంచి బార్ ఓనర్‌గా
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!

