SBI Cards MD and CEO : ఎస్బీఐలో తెలుగు వ్యక్తికి కీలక పదవి.. ఎండీ, సీఈఓగా రామ మోహన్‌ రావు అమర..

|

Feb 03, 2021 | 5:34 PM

ఎస్బీఐలో తెలుగు వ్యక్తి కీలక పదవి బాధ్యతలను స్వీకరించారు. ఎస్బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ (SBI CARD‌) కొత్తగా ఎండీ, సీఈఓగా తెలుగు వ్యక్తి రామ మోహన్‌ రావు అమర..

SBI Cards MD and CEO : ఎస్బీఐలో తెలుగు వ్యక్తికి కీలక పదవి.. ఎండీ, సీఈఓగా రామ మోహన్‌ రావు అమర..
Follow us on

SBI Cards MD and CEO : ఎస్బీఐలో తెలుగు వ్యక్తి కీలక పదవి బాధ్యతలను స్వీకరించారు. ఎస్బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ (SBI CARD‌) కొత్తగా ఎండీ, సీఈఓగా తెలుగు వ్యక్తి రామ మోహన్‌ రావు అమర ఈ బాధ్యతలు తీసుకున్నారు.  ఇప్పటివరకు ఎస్బీఐ కార్డ్‌కు సారథ్యం వహించిన అశ్వినీ కుమార్‌ తివారీ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. ఈనెల 30 నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ మోహన్‌ రావు అమర.. ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 1991లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్బీఐలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గడిచిన 29 ఏళ్లలో అమర ఎస్బీఐ గ్రూప్‌లో పలు హోదాల్లో పనిచేశారు.

ఎస్బీఐ కార్డ్‌ చీఫ్‌గా నియామకానికి ముందు ఎస్‌బీఐ భోపాల్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రామ మోహన్‌ రావు అమర.. క్రెడిట్‌, రిస్క్‌, ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. గతంలో సింగపూర్‌, అమెరికాలో ఎస్‌బీఐ కార్యకలాపాలకు సారథ్యం వహించారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..