Rakesh Jhunjhunwala: ఆ కంపెనీలో వాటాలు పెంచుకున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా.. లాభాల్లో దూసుకుపోతున్న షేర్ విలువ

Rakesh Jhunjhunwala: దిగ్గజ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడైన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఎందులో వాటాలు పెంచుకుంటే అందులో ఇతర మదుపర్లు కూడా భారీ పెట్టుబడులు పెడుతుంటారు. 

Rakesh Jhunjhunwala: ఆ కంపెనీలో వాటాలు పెంచుకున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా.. లాభాల్లో దూసుకుపోతున్న షేర్ విలువ
Rakesh Jhunjhunwala

Updated on: Oct 22, 2021 | 10:40 AM

Rakesh Jhunjhunwala: దిగ్గజ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టాటా గ్రూప్ కంపెనీలో వాటాలను మరింత పెంచుకున్నారు. సెప్టెంబర్ 30, 2021తో ముగిసిన రెండో త్రైమాసంలో టాటా మోటార్స్ డీవీఆర్ షేర్లను మరిన్ని కొనుగోలు చేశారు. దీంతో సెప్టెంబర్ 30 నాటికి ఆయన వద్ద టాటా మోటార్స్ డీవీఆర్‌లో బిగ్ బుల్‌గా గుర్తింపు సాధించిన ఆయన దగ్గర 3.93 శాతం వాటాలున్నాయి. అంతకు ముందు మొదటి త్రైమాసం చివరినాటికి (జూన్ 30) ఆయనకు ఇందులో 1.97 శాతం వాటాలు మాత్రమే ఉండేవి. ఇందులో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వాటాలను పెంచుకున్నారన్న కథనాలతో ఆ షేర్ విలువ గురువారంనాడు భారీగా లాభపడింది. ఓ దశలో 9 శాతం మేర ఒకే రోజు షేర్ విలువ లాభపడింది. చివరకు దాదాపు ఆరు శాతం లాభపడి రూ.255.55 వద్ద ముగిసింది.

ఇవాళ(శుక్రవారం) కూడా టాటా మోటార్స్ డీవీఆర్ షేర్ విలువ లాభాల్లో దూసుకుపోతోంది. శుక్రవారం ఉదయం రూ.260 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. కొద్ది సేపటి క్రితం ఒక్కో షేర్ రూ.9.25 (3.6 శాతం) లాభంతో రూ.264.80 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఓ దశలో రూ.271.80 వద్దకు చేరింది.

కాగా సెప్టెంబర్ 30నాటికి టాటా మోటార్స్‌లో ఆయనకు 1.11 శాతం వాటాలు ఉన్నాయి. అంతకు ముందు త్రైమాసం చివరినాటికి(జూన్ 30) ఆయనకు 1.14 శాతం వాటాలు ఉన్నాయి.

దిగ్గజ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడైన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఎందులో వాటాలు పెంచుకుంటే అందులో ఇతర మదుపర్లు కూడా భారీ పెట్టుబడులు పెడుతుంటారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థపై చర్చించారు.

Also Read..

PM Narendra Modi: ఇది భారతీయుల విజయం.. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే సాధ్యమైంది..

Samantha: సమంత పరువు నష్టం కేసులో ఏం తీర్పు రాబోతోంది? మరికాసేపట్లో..