Indian Railways: రైల్వే ప్రయాణికులు అలర్ట్‌.. ఆ సమయాల్లో నిలిచిపోనున్న రిజర్వేషన్‌ సేవలు

|

Nov 14, 2021 | 8:02 PM

Indian Railways: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే శాఖ అనే చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి రైళ్లు. అందులో తక్కువ ఛార్జీలు ఉండటంతో సామాన్య ప్రజలు కూడా రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతుంటారు...

Indian Railways: రైల్వే ప్రయాణికులు అలర్ట్‌.. ఆ సమయాల్లో నిలిచిపోనున్న రిజర్వేషన్‌ సేవలు
Indian Railway
Follow us on

Indian Railways: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే శాఖ అనే చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి రైళ్లు. అందులో తక్కువ ఛార్జీలు ఉండటంతో సామాన్య ప్రజలు కూడా రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతుంటారు. సామాన్యుడికి కూడా ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. అందుకే భారతీయ రైల్వే శాఖ  ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. ఈ తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడు రోజుల పాటు రాత్రి సమయంలో ఆరు గంటల పాటు ప్రయాణికుల రిజర్వేషన్‌ సిస్టమ్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ప్యాసింజర్‌ సేవలను మరింతగా మెరుగు పర్చేందుకు, అలాగే దశలవారీగా ప్రీ-కోవిడ్‌ స్థాయిలను మార్చడానికి ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (PRS) రాత్రి పూట 6 గంటల పాటు రిజర్వేషన్ సిస్టమ్స్ మూసివేయబడుతుందని తెలిపింది. అయితే లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు వచ్చిన తర్వాత రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. అది కూడా దూర ప్రాంతాలకు మాత్రమే రైళ్ల రాకపోకలు కొనసాగించగా, ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలోనే రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతోంది రైల్వే శాఖ.

ఇక ప్రయాణికుల నుంచి కొంత ఎక్కువ మొత్తంలో ఛార్జీలను తీసుకుంటూ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది రైల్వే. 2021 వర్కింగ్‌ టైమ్‌ టేబుల్‌లో చర్చబడిన రైలు మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, ప్రత్యేక రైలు సర్వీసులుగా ప్రస్తుతం నడుపుతున్న అన్ని రెగ్యులర్‌ టైమ్‌ టేబుల్‌ రైళ్లను రెగ్యులర్‌ నంబర్లతో నడపాలని రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అయితే జోనల్‌ రైల్వేలకు రాసిన లేఖలో రైళ్లు ఇప్పుడు వాటి సాధారణ నంబర్లతో నడపనున్నట్లు, ఛార్జీలు సాధారణ ప్రీ-కోవిడ్‌ ధరలు తిరిగి అందుబాటులోకి రానున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రత్యేక రైళ్లలలో టికెట్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇప్పుడు పెరిగిన ఛార్జీలను తగ్గించనున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

PM Fasal Bima Yojana: కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకంలో దరఖాస్తులు పెరిగినా.. బెనిఫిట్ పొందిన రైతుల సంఖ్య తగ్గింది..!

Home Loan Charges: మీరు హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఎలాంటి ఛార్జీలు ఉంటాయో గమనించండి