భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం భారీ రాయితీని అందిస్తోంది. రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా కోట్లాది రూపాయల రాయితీని అందిస్తుంది. ఏటా రూ.56,993 కోట్ల రాయితీని కల్పిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మంత్రి లోక్ సభలో పలు కీలక విషయాలను వెల్లడించారు. అన్ని రకాల టికెట్లపై ప్రతి సంవత్సరం రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి పలు విషయాలను సభకు వెల్లడించారు.
దేశంలోని ప్రతి రైల్వే ప్రయాణికుడికి టిక్కెట్‌పై 46 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను భారత్‌లో అప్‌గ్రేడేషన్ చేస్తోందని చెప్పారు. ప్రతి ప్రయాణికుడి టికెట్‌పై రూ.100 వెచ్చించాల్సి ఉంటే కేవలం రూ.54 మాత్రమే ఖర్చు పెట్టేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రైల్వే కల్పిస్తున్న ఈ రాయితీ సదుపాయం అన్ని కేటగిరిల ప్రయాణికులకు వర్తిస్తుందని అన్నారు. ఇక రైల్వేలో వేగవంతమైన సేవలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Autopay Cancellation: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ నెలనెలా డబ్బులు కట్ చేస్తున్నాయా? అయితే ఇలా ఆపేయండి!
భుజ్ – అహ్మదాబాద్‌ల మధ్య ఇప్పటికే నమో భారత్ రైలు సేవలను ప్రాంరభించామని, ఈ రెండు ప్రాంతాల మధ్య 359 కిలోమీటర్లు ఉండగా.. కేవలం 5 గంటల 45 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని అన్నారు. ఇండియన్ రైల్వే అందిస్తున్న సౌకర్యాలపై ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నట్లు భావిస్తున్నామని అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద అప్‌గ్రేడేషన్:
దేశంలోనే రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి ప్రభుత్వం అతిపెద్ద రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని రైల్వే మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను భారత్‌లో అప్‌గ్రేడ్ చేసే పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 1,300 రైల్వే స్టేషన్లు అప్‌గ్రేడ్ అవుతున్నాయన్నారు.
క్రీడాకారులకు రైల్వే ఛార్జీలలో రాయితీని పునరుద్ధరించే యోచనపై నగేష్ బాపురావు పాటిల్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రతి ప్రయాణికుడికి ప్రయాణ సబ్సిడీని అందించాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర ఎంపీ ప్రణితి షిండే ప్రశ్నను పునరావృతం చేస్తూ క్రీడాకారులకు ఏదైనా ప్రత్యేక రాయితీ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంతలో ఎంపీ దురై వైకో సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి రైల్వే మంత్రి తన సమాధానం ఇచ్చారు. ప్రయాణికులందరూ కేంద్రం ఇచ్చే మొత్తం సబ్సిడీ కిందకు వస్తారని అన్నారు.
ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ 19వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా? దరఖాస్తు చేయడం ఎలా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి