వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ్ 2025 కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి, తిరిగి వచ్చే కోట్లాది మంది భక్తుల సురక్షితమైన ప్రయాణం కోసం భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ భారీ మతపరమైన కార్యక్రమం కోసం రైల్వే 10,000 కంటే ఎక్కువ రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేసింది. 12 ఏళ్ల తర్వాత మహాకుంభం నిర్వహిస్తుండటంతో ఈ కార్యక్రమానికి 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
మహాకుంభం కోసం 3,300 ప్రత్యేక రైళ్లు:
రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ) దిలీప్ కుమార్ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే ప్లాన్ వివరాలను వెల్లడించారు. మహా కుంభ్ వంటి అతి ముఖ్యమైన ఈవెంట్ సందర్భంగా సంగమ స్నానానికి ప్రయాణించే ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి భారతీయ రైల్వే 3,300 ప్రత్యేక రైళ్లతో సహా 10,000 కంటే ఎక్కువ రైళ్లను నడుపుతుందని ఆయన ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కోసం స్టేషన్‌లలో కలర్-కోడింగ్ వెయిటింగ్, హోల్డింగ్ ప్రాంతాలతో సహా రద్దీని నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కుమార్ చెప్పారు.
సంగం స్నాన్‌కు వెళ్లే, వ్యక్తుల కోసం భారతీయ రైల్వే 10,000 కంటే ఎక్కువ రైళ్లు, అలాగే 3,300 ప్రత్యేక రైళ్లను నడపనుంది. రైల్వే స్టేషన్‌లో అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ కోసం కలర్-కోడెడ్ వెయిటింగ్, హోల్డింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు వారి వారి ప్రాంతాలకు మళ్లించబడతారు. ఇందు కోసం ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు.
భారతీయ రైల్వే ప్రణాళిక ఏమిటి?
ప్రయాణం, ఆరోగ్య సేవలు, భద్రతా ప్రోటోకాల్‌ల గురించి అవసరమైన వివరాలను అందించడానికి 22 భాషలలో సమాచారం బుక్‌లెట్ తయారు చేయనున్నారు. భాషా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులందరికీ సమాచారం చేరుతుందని 12 భాషలలో ప్రకటనలు ఉంటాయని తెలిపారు. ప్రయాణికుల ప్రయాణంలో వారికి సహాయం చేయడానికి ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్స్ (TTE) బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులకు వసతి కల్పించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాగ్‌రాజ్‌లో తాత్కాలిక “టెన్త్ సిటీ”ని ఏర్పాటు చేసింది.
ప్రథమ చికిత్స, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి అన్ని ప్రధాన స్టేషన్లలో మెడికల్ బూత్‌లు, మినీ హాస్పిటల్‌లు ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది 24 గంటల్లో అందుబాటులో ఉంటారు. పలు ప్రాంతాల్లో అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్థానిక ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యవసర ప్రణాళికను రూపొందించారు.
ఇది కూడా చదవండి: School Holidays: 2025లో ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా? పూర్తి జాబితా!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి