Indian Railways: జూలై 1 నుండి రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ మళ్లీ వర్తిస్తుందా..? ఇందులో నిజమెంత..?

|

Jun 16, 2022 | 2:51 PM

Indian Railways: భారతీయ రైల్వేలో సీనియర్ సిటిజన్ల రాయితీలు: కోవిడ్ కాలంలో రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న ఛార్జీల రాయితీని భారతీయ రైల్వే తాత్కాలికంగా..

Indian Railways: జూలై 1 నుండి రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ మళ్లీ వర్తిస్తుందా..? ఇందులో నిజమెంత..?
Follow us on

Indian Railways: భారతీయ రైల్వేలో సీనియర్ సిటిజన్ల రాయితీలు: కోవిడ్ కాలంలో రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న ఛార్జీల రాయితీని భారతీయ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. అప్పటి నుండి సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలలో ఎలాంటి రాయితీ లభించడం లేదు. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతోంది. ఇందులో భారతీయ రైల్వే జూలై 1 నుండి సీనియర్ సిటిజన్ రాయితీని మళ్లీ అమలు చేయబోతున్నట్లు ఈ మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో కొన్ని వైరల్ సందేశాల ద్వారా జూలై 1 నుండి రైలు ఛార్జీలలో సీనియర్ సిటిజన్ రాయితీ మళ్లీ ప్రారంభమవుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ అటువంటి ఉత్తర్వులు లేదా ప్రకటనను జారీ చేయలేదని, ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు రైళ్లలో ఛార్జీలలో రాయితీ లభించదని పీఐపీ (PIB) ఫ్యాక్ట్‌ చెక్‌ క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఏ మాత్రం లేదని ఒక ట్వీట్‌లో ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

జూలై 1 నుండి రైళ్లలో సీనియర్ సిటిజన్ రాయితీని అమలు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇటువంటి పుకార్లను నమ్మవద్దని తెలిపింది. వారిని తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి ప్రకటనలు వైరల్‌ అవుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం భారతీయ రైల్వే దివ్యాంగులకు, రోగులు, విద్యార్థులకు మాత్రమే ఛార్జీలలో రాయితీని అందిస్తోంది.

 


ఏమంటోంది, సీనియర్ సిటిజన్స్ రాయితీని మళ్లీ ఎప్పటికి అమలు చేస్తారో తెలుపాలని పలువురు అధికారులను ప్రశ్నించగా, ప్రస్తుతానికి దీనిపై తమకు సమాచారం లేదని అధికారులు చెప్పారు. అందువల్ల సీనియర్ సిటిజన్ల రాయితీని అమలు చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదా రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రస్తుతం లేదని ఫ్యాక్ట్‌ చెక్‌ స్పష్టం చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి